సంప్రదాయ పరిమళాలను ఆస్వాదించడానికి ఆ సబ్బు మళ్లీ మళ్లీ కొంటా

ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్‌ శాండల్‌ సోప్‌ తయారీకి సంబంధించిన వీడియోను 'ఎక్స్‌'లో పోస్టు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర

Advertisement
Update:2024-12-21 15:32 IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. చాలా ఆస్తికర, ప్రేరణ కలిగించే వీడియోలను పోస్టు చేస్తుంటారు. తాజాగా ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్‌ శాండల్‌ సోప్‌ తయారీకి సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంప్రదాయ పరిమళాలను ఆస్వాదించడానికి మళ్లీ మళ్లీ కొంటానని రాసుకొచ్చారు.



మైసూర్‌ శాండల్‌ ఫ్యాక్టరీ కర్ణాటకలోని ప్రభుత్వ రంగ సంస్థ. 1916లో అప్పటి మైసూర్‌ రాజు నల్వాడి కృష్ణరాజు వడియార్‌, అప్పట్లో ఆయన దివానుగా ఉన్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీన్ని నెలకొల్పారు. సహసిద్ధమైన గంధం నూనెలతో అత్యంత నాణ్యతతో సబ్సులు తయారు చేయడం దీని ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా మైసూర్‌ శాండల్‌ సబ్బులకు గిరాకీ ఉన్నది. రోజుకు 10-12 లక్షల సబ్సులను తయారు చేస్తుంటారు. మొదట్లో సబ్బులను మాత్రమే తయారుచేసేవారు. ప్రస్తుతం డిటర్జెంట్‌లు, పౌడర్‌, ఫేస్‌ క్రీమ్‌, షాంపూ లాంటి 40 రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఈ సంస్థకు గతంలో మహేంద్రసింగ్‌ ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరించిన విషయం తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News