ఆసీస్ తో వన్డే సిరీస్.... హార్థిక్ పాండ్యా, రాహుల్ దూరం

యంగ్ గన్స్ కు తప్పని కాఫీ విత్ కరణ్ షో దెబ్బ పాండ్యా వ్యాఖ్యలను ఖండించిన టీమిండియా కెప్టెన్ ఆసీస్ తో రేపటి నుంచే తీన్మార్ వన్డే సిరీస్ టీమిండియా యంగ్ గన్స్ హార్థిక్ పాండ్యా, కెఎల్. రాహుల్ లకు…కాఫీ విత్ కరణ్ షో దెబ్బ తగిలింది. సిడ్నీ వేదికగా రేపు ఆస్ట్రేలియాతో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే టీమిండియా తుదిజట్టులో … ఓపెనర్ రాహుల్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలకు చోటు లేకుండా పోయింది. […]

Advertisement
Update:2019-01-11 13:38 IST
  • యంగ్ గన్స్ కు తప్పని కాఫీ విత్ కరణ్ షో దెబ్బ
  • పాండ్యా వ్యాఖ్యలను ఖండించిన టీమిండియా కెప్టెన్
  • ఆసీస్ తో రేపటి నుంచే తీన్మార్ వన్డే సిరీస్

టీమిండియా యంగ్ గన్స్ హార్థిక్ పాండ్యా, కెఎల్. రాహుల్ లకు…కాఫీ విత్ కరణ్ షో దెబ్బ తగిలింది. సిడ్నీ వేదికగా రేపు ఆస్ట్రేలియాతో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే టీమిండియా తుదిజట్టులో … ఓపెనర్ రాహుల్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలకు చోటు లేకుండా పోయింది.

కాఫీ విత్ కరణ్ షో లో అనుచితంగా, అల్లరి చిల్లరిగా మాట్లాడిన కారణంగా హార్థిక్ పాండ్యాతో పాటు..రాహుల్ పైన రెండుమ్యాచ్ ల నిషేధం విధించాలని బీసీసీఐ పాలకమండలి సిఫారసు చేసింది.

అయితే…బీసీసీఐ కాంట్రాక్టులు పొందిన ఈ ఇద్దరి పైనా రెండుమ్యాచ్ ల నిషేధం న్యాయపరంగా చెల్లుతుందా? లేదా? అన్న విషయమై విచారణ జరపడానికి ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ నివేదిక వచ్చే వరకూ…పెండింగ్ ఎంక్వయిరీగా ఉంచాలని డయానా ఎడుల్జీ సూచించారు.

ఈ గందరగోళం మధ్య… ఈ ఇద్దరినీ తొలివన్డే ఆడించ రాదని భారత్ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News