హెరిటేజ్‌లో పలాస జీడిపప్పు కిలో ఎంత బాబు?

బెంగళూరు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగేందుకు చంద్రబాబుకు తీరిక ఉంటుంది కానీ…. పక్కనే ఉన్న అనంతపురం జిల్లాకు వెళ్లి కరువును పరిశీలించే సమయం మాత్రం లేదని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. చెన్నై వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ సాంబారు తింటాడే కానీ… పక్కనే ఉన్న సొంత జిల్లాకు వెళ్లి కరువు పరిస్థితిని సమీక్షించరని విమర్శించారు. కోల్‌కత్తా వెళ్లి మమతాబెనర్జీతో కలిసి చికెన్ తినే చంద్రబాబు…. సొంత రాష్ట్రంలోని రైతుల కష్టాలు మాత్రం పట్టించుకోరన్నారు. 2008-09 ఏడాదిలో […]

Advertisement
Update:2019-01-09 12:18 IST

బెంగళూరు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగేందుకు చంద్రబాబుకు తీరిక ఉంటుంది కానీ…. పక్కనే ఉన్న అనంతపురం జిల్లాకు వెళ్లి కరువును పరిశీలించే సమయం మాత్రం లేదని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.

చెన్నై వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ సాంబారు తింటాడే కానీ… పక్కనే ఉన్న సొంత జిల్లాకు వెళ్లి కరువు పరిస్థితిని సమీక్షించరని విమర్శించారు. కోల్‌కత్తా వెళ్లి మమతాబెనర్జీతో కలిసి చికెన్ తినే చంద్రబాబు…. సొంత రాష్ట్రంలోని రైతుల కష్టాలు మాత్రం పట్టించుకోరన్నారు.

2008-09 ఏడాదిలో పంట విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లుగా ఉంటే చంద్రబాబు హయాంలో 40లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. వైఎస్ హయాంలో పంట దిగుబడి 166 లక్షల టన్నులుగా ఉంటే.. చంద్రబాబు వచ్చే సరికి 2017-18కి 150 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. చంద్రబాబు మాత్రం నదులు అనుసంధానం చేశానని… పట్టిసీమ నీరు సీమకు తరలించానని… రెయిన్ గన్‌లతో కరువు తరిమేశానని… వ్యవసాయంలో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు ఉందని అబద్దాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు.

అత్యధికంగా అప్పులున్న రైతుల జాబితాలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. రుణమాఫి పేరుతో చంద్రబాబు మోసం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సరికి రైతుల అప్పులు 87వేల 612 కోట్లుగా ఉండగా… ఇప్పుడు వడ్డీమీద వడ్డీ పడి లక్షా 30వేల కోట్లకు ఎగబాకాయన్నారు. పాదయాత్ర ముగింపు సందర్బంగా ఇచ్చాపురం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.

చంద్రబాబు చేసిన మోసాలను రైతులు అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ రోజు చంద్రబాబును ప్రజలు ”నమ్మం బాబు” అంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. హెరిటేజ్ సంస్థలకు లాభాలు తెచ్చేందుకు చంద్రబాబే దళారీలకు దళపతిగా మారారని జగన్ విమర్శించారు.

పలాసలో జీడిపప్పును రైతులు కిలో 650 రూపాయలకు కూడా అమ్ముకోలేకపోతున్నారని… ఇదే జీడిపప్పు చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కేజీ 1,120 రూపాయలకు అమ్ముతున్నారని జగన్ అన్నారు. ఇలా ముఖ్యమంత్రే స్వయంగా రైతులను దోచుకునేందుకు సిద్ధపడితే ఇక అన్నదాతలకు దిక్కెవరని జగన్‌ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News