యువజన ఒలింపిక్స్ స్వర్ణ విజేతకు అవమానం

హర్యానా ప్రభుత్వం నిర్లక్ష్యం పై షూటర్ మను బాకర్ ఫైర్ 2 కోట్ల నజరానా ఇవ్వకుండా తాత్సారం చేస్తుందంటూ ఆందోళన భారత షూటింగ్ సంచలనం, ప్రపంచ యువజన ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మను బాకర్ కు కోపం వచ్చింది. హర్యానా ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది. యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినా…హర్యానా ప్రభుత్వం తనకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వకపోవడం పట్ల .. ఆందోళన వ్యక్తం చేసింది. స్వర్ణం తెచ్చినా…. ప్రపంచ జూనియర్, […]

Advertisement
Update:2019-01-05 10:42 IST
  • హర్యానా ప్రభుత్వం నిర్లక్ష్యం పై షూటర్ మను బాకర్ ఫైర్
  • 2 కోట్ల నజరానా ఇవ్వకుండా తాత్సారం చేస్తుందంటూ ఆందోళన

భారత షూటింగ్ సంచలనం, ప్రపంచ యువజన ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మను బాకర్ కు కోపం వచ్చింది. హర్యానా ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది.

యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినా…హర్యానా ప్రభుత్వం తనకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వకపోవడం పట్ల .. ఆందోళన వ్యక్తం చేసింది.

స్వర్ణం తెచ్చినా….

ప్రపంచ జూనియర్, యువజన ఒలింపిక్స్ తో పాటు కామన్వెల్త్ గేమ్స్ లో సైతం దేశానికి పలు పతకాలు అందించిన రికార్డు మను బాకర్ కు ఉంది.

యూత్ ఒలింపిక్స్ కు సమాయత్తం కావడం కోసం తాను భారీగా ఖర్చు పెట్టానని… మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు ఇది భరించలేని భారమేనని మను బాకర్ వాపోయింది.

ప్రభుత్వం ప్రకటించిన 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వకుండా తాత్సారం చేయడం ఎందుకో తనకు అర్థంకావడం లేదని చెప్పింది.

భారత తొలిషూటర్ మను…

అర్జెంటీనా లోని బ్యునోస్ ఏర్స్ వేదికగా ముగిసిన ప్రపంచ యువజన ఒలింపిక్స్ షూటింగ్ లో…మను బాకర్ 236.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం ద్వారా బంగారు పతకం అందుకొంది.

యువజన ఒలింపిక్స్ చరిత్రలో బంగారు పతకం సాధించిన భారత తొలి షూటర్ ఘనతను మను దక్కించుకోడంతో… 2 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యతరగతి కుటుంబం నుంచి….

జీవితకాలంలో ఎవరికైనా ఒక్కసారి మాత్రమే యూత్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం వస్తుందని …అలాంటి అవకాశం కోసం ఎదురుచూసిన తన కోసం తన కుటుంబం ఎంతో ఖర్చు చేసిందని.. కఠోరసాధనతో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టినా.. హర్యానా ప్రభుత్వం తనను ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆందోళన వ్యక్తం చేసింది.

తనను ఇకముందు అన్ని విధాలా ప్రోత్సహించాలని… ప్రోత్సహించగలదన్న విశ్వాసం ప్రభుత్వం పైన ఉందని చెప్పింది.

మను తండ్రి విచారం…

ప్రపంచ యువజన ఒలింపిక్స్ తో సహా వివిధ అంతర్జాతీయ టోర్నీలలో తన కుమార్తె ..దేశానికి బంగారు పతకాలు సంపాదించిపెడుతున్నా…హర్యానా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోడం లేదని… ప్రకటించిన ప్రోత్సాహక నగదు బహుమతులు సైతం ఇవ్వడం లేదంటూ షూటర్ మను బాకర్ తండ్రి రామకృష్ణ బాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

హర్యానా ప్రభుత్వ గతంలో తన కుమార్తెను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించి..ఆ తర్వాత తొలగించడం ద్వారా మనస్తాపం కలిగించారని మండిపడ్డారు. ఇలా చేయడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలని సూచించారు.

మను పై హర్యానా మంత్రి గరంగరం…

షూటర్ మను బాకర్ …. తనకు ప్రకటించిన ప్రోత్సాహక బహుమతి అందని విషయాన్ని ప్రభుత్వానికి తెలపకుండా… సోషల్ మీడియాకు ఎక్కడం పట్ల హర్యానా క్రీడామంత్రి అనీల్ విజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్య ఉంటే ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించుకోవాలని…సోషల్ మీడియా ద్వారా అల్లరి చేయటం ఎంత వరకూ న్యాయమని అన్నారు. ఇకనైనా…. మను బాకర్ తన ఆటపైన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందంటూ సలహా ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News