స్కీయింగ్ మహిళల విభాగంలో ప్రపంచ రికార్డు

23 ఏళ్లకే 50 ప్రపంచ టైటిల్స్ నెగ్గిన షిప్రిన్ ఫ్రెంచ్ ఆల్ప్శ్ వేదికగా ప్రపంచ మహిళా స్కీయింగ్ పోటీలు రక్తం గడ్డకట్టుకుపోయే చలి వాతావరణం ఓవైపు. మంచు దుప్పటి కప్పుకొన్న ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు మరోవైపు. ఈ వాతావరణంలో…మంచుకొండలపై జర్రున జారిపోయే క్రీడే స్కీయింగ్. అందునా జెయింట్ స్లాలోమ్ స్కీయింగ్ లో రాణించడం సంగతి అటుంచి…పాల్గొనటానికే గుండెల నిండుగా ధైర్యం కావాలి. ఇలాంటి కష్టమైన, క్లిష్టమైన క్రీడలో…అందునా ప్రపంచకప్ రేస్ ల్లో యాభై విజయాలు సాధించడం […]

Advertisement
Update:2018-12-27 00:32 IST
  • 23 ఏళ్లకే 50 ప్రపంచ టైటిల్స్ నెగ్గిన షిప్రిన్
  • ఫ్రెంచ్ ఆల్ప్శ్ వేదికగా ప్రపంచ మహిళా స్కీయింగ్ పోటీలు

రక్తం గడ్డకట్టుకుపోయే చలి వాతావరణం ఓవైపు. మంచు దుప్పటి కప్పుకొన్న ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు మరోవైపు. ఈ వాతావరణంలో…మంచుకొండలపై జర్రున జారిపోయే క్రీడే స్కీయింగ్.

అందునా జెయింట్ స్లాలోమ్ స్కీయింగ్ లో రాణించడం సంగతి అటుంచి…పాల్గొనటానికే గుండెల నిండుగా ధైర్యం కావాలి.

ఇలాంటి కష్టమైన, క్లిష్టమైన క్రీడలో…అందునా ప్రపంచకప్ రేస్ ల్లో యాభై విజయాలు సాధించడం అంటే మాటలా మరి. అలాంటి అరుదైన రికార్డును, ఘనతను అమెరికన్ యువతి మక్యేలా షిఫ్రిన్ సాధించడమే కాదు…అత్యంత పిన్నవయసులో ప్రపంచ రికార్డు సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకొంది.

2014 వింటర్ ఒలింపిక్స్ జెయింట్ స్లాలోమ్ స్కీయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన షిఫ్రిన్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. 23వ పుట్టినరోజు నాటికే… ప్రపంచ స్కీయింగ్ లో యాభై రేస్ విజయాలు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా సంచలనం సృష్టించింది.

ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాలు వేదికగా ముగిసిన 2018 ప్రపంచ స్కీయింగ్ మహిళల విభాగంలో షిఫ్రిన్ అలవోకగా స్వర్ణ పతకం సంపాదించింది. మహిళల స్కీయింగ్ చరిత్రలో…అత్యధికంగా 82 విజయాలు సాధించిన రికార్డు అమెరికా సీనియర్ రేసర్ లిండ్సే వోన్ పేరుతో ఉంది. అయితే అతిచిన్న వయసులోనే యాభై ప్రపంచకప్ రేస్ ల్లో విజేతగా నిలిచిన ఘనత మాత్రం షిఫ్రిన్ కు మాత్రమే దక్కుతుంది.

Tags:    
Advertisement

Similar News