118.... సస్పెన్స్ ఎక్కువ

ఒకప్పుడు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కథలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు కల్యాణ్ రామ్. రానురాను ఈ టైపు సినిమాలు చేయడం తగ్గించేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు కల్యాణ్ రామ్ తన పాత ట్రాక్ మీదకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో 118 అనే సినిమా చేశాడు. ఈ టైటిల్ కు సినిమాకు సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే అర్థంకాదు. త్వరలోనే విడుదలకానున్న ట్రయిలర్ చూసినా కూడా అర్థంకాదు. […]

Advertisement
Update:2018-12-18 09:23 IST

ఒకప్పుడు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కథలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు కల్యాణ్ రామ్. రానురాను ఈ టైపు సినిమాలు చేయడం తగ్గించేశాడు. మళ్లీ ఇన్నేళ్లకు కల్యాణ్ రామ్ తన పాత ట్రాక్ మీదకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో 118 అనే సినిమా చేశాడు. ఈ టైటిల్ కు సినిమాకు సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే అర్థంకాదు. త్వరలోనే విడుదలకానున్న ట్రయిలర్ చూసినా కూడా అర్థంకాదు. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇదే మరి.

సరే.. ఈ మేటర్ పక్కనపెడితే.. ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు కల్యాణ్ రామ్. దర్శకుడిగా ఇతడు ఏ రేంజ్ లో మెప్పించాడనే విషయాన్ని టీజర్ చూసి చెప్పలేం కానీ, ఓ సినిమాటోగ్రాఫర్ గా మాత్రం గుహన్ కు ఈ టీజర్ చూసి వందకు వంద మార్కులు వేసేయొచ్చు. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి విజువల్స్.

సస్పెన్స్ థ్రిల్లర్ కథకు కావాల్సిన సెటప్ మొత్తం 118కు దొరికినట్టు టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అర్జున్ రెడ్డితో మెరిసిన షాలినీ పాండే, చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులముందుకొస్తోంది. ఇక మరో హీరోయిన్ నివేత థామస్ పాత్రను కూడా సీక్రెట్ గా ఉంచుతున్నారు. జనవరిలో సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు టీజర్ తో పాటు ప్రకటించారు మేకర్స్.

Full View

Tags:    
Advertisement

Similar News