పెద్ద నోట్లు రద్దు చేయాలన్నది నేనే... టీఆర్‌ఎస్ నో అన్నాకే కాంగ్రెస్‌తో...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం చేస్తానన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు బ్యాలెట్‌లనే వాడుతుంటే మన దేశంలో మాత్రం ఈవీఎంలు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈవీఎంలలో అక్రమాలు జరుగుతాయన్నారు. ఒకవేళ అక్రమాలపై కోర్టుకు వెళ్లినా ఆ కేసులు తేలేందుకు మూడు నాలుగేళ్లు పడుతోందని… అంతవరకు ఈవీఎంలలో డేటా ఉంటుందా అని ప్రశ్నించారు. కాబట్టి పాతపద్దతిలోనే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపైనా […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం చేస్తానన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు బ్యాలెట్‌లనే వాడుతుంటే మన దేశంలో మాత్రం ఈవీఎంలు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఈవీఎంలలో అక్రమాలు జరుగుతాయన్నారు. ఒకవేళ అక్రమాలపై కోర్టుకు వెళ్లినా ఆ కేసులు తేలేందుకు మూడు నాలుగేళ్లు పడుతోందని… అంతవరకు ఈవీఎంలలో డేటా ఉంటుందా అని ప్రశ్నించారు. కాబట్టి పాతపద్దతిలోనే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపైనా చంద్రబాబు స్పందించారు. ఫెథాయ్‌పై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… తొలుత తాను టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునేందుకే ప్రయత్నించానని చెప్పారు. కానీ టీఆర్‌ఎస్ అంగీకరించకపోవడం వల్లే కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టామన్నారు.
తాను తెలంగాణ ఎన్నికల్లో పనిచేశానని… టీఆర్‌ఎస్ ఏపీలో వేలుపెడుతామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చారో గుర్తించుకోవాలన్నారు. టీడీపీ తెలంగాణలో వేలుపెట్టిందని… తాము ఏపీలో వేలు పెడతామనడం కరెక్ట్ కాదన్నారు.
టీడీపీకి తెలంగాణలో ఏం జరిగిందో… ఆంధ్రాలోనూ అదే జరుగుతుందనుకుంటున్నారని… కానీ అలా జరగబోదన్నారు. పెద్దనోట్లు రద్దు చేయాల్సిందిగా సలహా ఇచ్చింది తానేనన్నారు. కానీ పెద్దనోట్లు రద్దు చేసి తిరిగి మరో పెద్ద నోటును తీసుకొచ్చారని చంద్రబాబు విమర్శించారు.