సైన్యానికి బుల్లెట్‌ ఫ్రూప్‌ జాకెట్లు కూడా కొనని కాంగ్రెస్ ప్రభుత్వం

రఫెల్ వివాదంపై ప్రధాని మోడీ తొలిసారిగా సుధీర్ఘంగా స్పందించారు. సోనియా నియోజక వర్గం రాయ్‌ బరేలీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ… అర గంట పాటు రాఫెల్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. బోఫోర్స్, ఆగస్టా కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. బోఫోర్స్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఖత్రోచీని రాహుల్ మామ అంటారంటూ… తమ ప్రభుత్వంలో ఖత్రోచీ మామలు, క్రిస్టియన్‌ మిషెల్‌లు లేరని మోడీ వ్యాఖ్యానించారు. తన దేశ సైన్యం బలోపేతమవడం కొన్ని […]

Advertisement
Update:2018-12-17 03:06 IST

రఫెల్ వివాదంపై ప్రధాని మోడీ తొలిసారిగా సుధీర్ఘంగా స్పందించారు. సోనియా నియోజక వర్గం రాయ్‌ బరేలీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ… అర గంట పాటు రాఫెల్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. బోఫోర్స్, ఆగస్టా కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు.

బోఫోర్స్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఖత్రోచీని రాహుల్ మామ అంటారంటూ… తమ ప్రభుత్వంలో ఖత్రోచీ మామలు, క్రిస్టియన్‌ మిషెల్‌లు లేరని మోడీ వ్యాఖ్యానించారు. తన దేశ సైన్యం బలోపేతమవడం కొన్ని శక్తులకు ఇష్టం లేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సైనికుల కోసం లక్షా 86 బుల్లెట్‌ ఫ్రూప్ జాకెట్లు కొనాల్సిందిగా 2009లో ఆర్మీ విజ్ఞప్తి చేస్తే యూపీఏ పట్టించుకోలేదన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే 2016లో 50వేల బుల్లెట్ ఫ్రూప్‌ జాకెట్లను కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది మరో లక్ష జాకెట్లను కొనబోతున్నామని వివరించారు. సైనికులకు బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు కొనివ్వడం ఇష్టం లేని వారు కూడా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రఫెల్‌పై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా వివాదం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొందరి దృష్టిలో రక్షణశాఖ, రక్షణ మంత్రి, వాయుసేన అధికారులు, ఫ్రాన్స్‌ ప్రభుత్వం కూడా అబద్ధాలు చెబుతున్నట్లే లెక్క అన్నారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా అబద్దాలు చెబుతున్నట్టు వారికి కనిపిస్తోందని న్యాయవ్యవస్థ విశ్వసనీయతపైనే అపనమ్మకం కలిగే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని ప్రధాని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News