కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని సహించేదిలేదు....

అధికారులపై మండిపడ్డ సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల పనుల జాప్యంపై సీఎం కేసీఆర్ సీరియస్ రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల ఆలస్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… అధికారులపై మండిపడ్డారు. యుద్థ ప్రాతి పదికన పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని సూచించారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. సీతారామ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవం పథకం పనులు […]

Advertisement
Update:2018-12-16 02:47 IST
  • అధికారులపై మండిపడ్డ సీఎం కేసీఆర్
  • సాగునీటి ప్రాజెక్టుల పనుల జాప్యంపై సీఎం కేసీఆర్ సీరియస్

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల ఆలస్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… అధికారులపై మండిపడ్డారు.

యుద్థ ప్రాతి పదికన పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని సూచించారు. కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు.

సీతారామ, శ్రీరాంసాగర్ పునరుజ్జీవం పథకం పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో కాళేశ్వరం పంప్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలిస్తానని చెప్పారు.

ఈనెల 18న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను సందర్శించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి 80కోట్లు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను సీఎం ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News