ఫిబ్రవరి 25న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఫిబ్రవరి 25న లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందని ఎన్నికల కమిషన్‌ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. మొత్తం తొమ్మిది దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ ఆరున మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తారు. 2014లో లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగిన శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా లోక్‌సభతో […]

Advertisement
Update:2018-12-15 12:15 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఫిబ్రవరి 25న లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందని ఎన్నికల కమిషన్‌ ఉన్నత వర్గాలు వెల్లడించాయి.

మొత్తం తొమ్మిది దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ ఆరున మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తారు.

2014లో లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగిన శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా లోక్‌సభతో పాటు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 25న లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనుంది.

2014లో కూడా ఏప్రిల్ ఏడు నుంచి మే 12 వరకు తొమ్మిది విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి ఒక రోజు ముందే అంటే ఏప్రిల్‌ ఆరు నుంచే పోలింగ్‌ మొదలవుతుంది. ఫిబ్రవరి 25న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సిద్దమైన ఎన్నికల కమిషన్‌… పారామిలటరీతో పాటు అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది.

Tags:    
Advertisement

Similar News