బెజవాడలో భారీగా యువ ఓటర్లు

విజయవాడలో భారీగా కొత్త ఓట్లు చేరాయి. యువకులు భారీగా తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సంఖ్య భారీగా ఉంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 15 వేల 755 కొత్త ఓట్లు నమోదు కాగా… విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్‌ మూడు నియోజకవర్గాల్లోనే 83వేల 122 కొత్త ఓట్లు చేరాయి. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 29వేల 435 మంది యువత కొత్తగా ఓటర్లుగా జాయిన్ అయ్యారు. విజయవాడ వెస్ట్‌లో 26వేల […]

Advertisement
Update: 2018-12-07 00:15 GMT

విజయవాడలో భారీగా కొత్త ఓట్లు చేరాయి. యువకులు భారీగా తమ ఓట్లను నమోదు చేసుకున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సంఖ్య భారీగా ఉంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 15 వేల 755 కొత్త ఓట్లు నమోదు కాగా… విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్‌ మూడు నియోజకవర్గాల్లోనే 83వేల 122 కొత్త ఓట్లు చేరాయి.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 29వేల 435 మంది యువత కొత్తగా ఓటర్లుగా జాయిన్ అయ్యారు. విజయవాడ వెస్ట్‌లో 26వేల 378 మంది, విజయవాడ ఈస్ట్‌లో 27వేల 309 మంది ఓటర్లు జాయిన్ అయ్యారు.

కొత్త ఓటర్లను చేర్పించడంలో పార్టీలే పోటీపడి చొరవ తీసుకున్నాయి. తమకు సానుభూతిపరులైన వారి ఓటర్లను చేర్పించడంలో చురుగ్గా వ్యవహరించారు. విజయవాడలో సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా పోటాపోటీగా యువత ఓటర్లుగా చేరడానికి ఒక కారణమని భావిస్తున్నారు. కొత్త ఓటర్లను చేర్పించడంతో టీడీపీతో పాటు.. వైసీపీ, జనసేన శ్రేణులు చురుగ్గా వ్యవహరించాయి.

Tags:    
Advertisement

Similar News