నాడు ఫొటో దిగి.... ఇప్పుడు శత్రువంటావా కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలందరిని ఇప్పుడు తెలంగాణలో మోహరింపచేశారు. గులాంనబీ ఆజాద్ ఇప్పటికే తెలంగాణలో మకాం వేయగా.. తమిళనాడు నుంచి హీరోయిన్ కం కాంగ్రెస్ నేత ఖుష్బు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్లమెంట్ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడారు. దళిత నేత అయిన […]

Advertisement
Update:2018-11-30 08:00 IST

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలందరిని ఇప్పుడు తెలంగాణలో మోహరింపచేశారు. గులాంనబీ ఆజాద్ ఇప్పటికే తెలంగాణలో మకాం వేయగా.. తమిళనాడు నుంచి హీరోయిన్ కం కాంగ్రెస్ నేత ఖుష్బు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్లమెంట్ పక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడారు. దళిత నేత అయిన ఖర్గే కేసీఆర్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తనే ముఖ్యమంత్రి అయ్యి మోసం చేశాడని ఆరోపించారు. ఎన్నికల హామీలను కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు.

నాడు తెలంగాణ ఇచ్చిన సోనియా ఇంటికెళ్లి ఆమెతో ఫొటో దిగిన కేసీఆర్.. ఇప్పుడు ఆమెను, కాంగ్రెస్ ను శత్రువు అనడం ఏంటని ఖర్గే సూటిగా ప్రశ్నించారు. ఇలా ద్రోహం చేసిన వారికి తెలంగాణ ప్రజలు అండగా ఉండరని.. ఈసారి ఖచ్చితంగా ఓడిస్తారని ఖర్గే తెలిపారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ వారిని మోసం చేశాడని ఆరోపించారు.

దేశంలో బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని.. బీజేపీ పాలనలో ఎవరికీ భద్రతలేదని ఖర్గే విమర్శించారు. బీజేపీని ఈసారి దేశ ప్రజలు ఓడించడానికి రెడీ అయ్యారని ఆరోపించారు. నోట్ల రద్దుతో ప్రజలు బాధపడ్డారని.. చాలా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. బీజేపీని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News