టీ-20 మహిళా ప్రపంచకప్ లో ఇక సెమీస్ సమరం

భారత మహిళలను ఊరిస్తున్న ఫైనల్స్ బెర్త్ రెండో సెమీఫైనల్లో భారత్ తో ఇంగ్లండ్ ఢీ నవంబర్ 23 న రెండో సెమీఫైనల్స్ కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 మహిళా ప్రపంచకప్ లో…సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సెయింట్ లూషియా స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా, గ్రూప్ -బీ టాపర్ భారత్ తో ఇంగ్లండ్ తలపడనున్నాయి. నాకౌట్ ఫైట్స్….. 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ […]

Advertisement
Update:2018-11-19 17:20 IST
  • భారత మహిళలను ఊరిస్తున్న ఫైనల్స్ బెర్త్
  • రెండో సెమీఫైనల్లో భారత్ తో ఇంగ్లండ్ ఢీ
  • నవంబర్ 23 న రెండో సెమీఫైనల్స్

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న టీ-20 మహిళా ప్రపంచకప్ లో…సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సెయింట్ లూషియా స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా, గ్రూప్ -బీ టాపర్ భారత్ తో ఇంగ్లండ్ తలపడనున్నాయి.

నాకౌట్ ఫైట్స్…..

2018 మహిళా టీ-20 ప్రపంచకప్ లో… తొలిదశ గ్రూప్ లీగ్ సమరానికి తెరపడటంతోనే…. సెమీఫైనల్స్ నాకౌట్ ఫైట్స్ కు… కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో సెయింట్ లూషియా లోని డారెన్ సామీ స్టేడియం, గయానా నేషనల్ స్టేడియం వేదికలుగా… గత రెండువారాలుగా సాగిన… పదిదేశాల జట్ల గ్రూప్ లీగ్ సమరం నుంచి…. డిఫెండింగ్ చాంపియన్ విండీస్, మూడుసార్లు విజేత ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్, రెండుసార్లు సెమీ ఫైనలిస్ట్ భారత్… నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించాయి.

భారత్ ఆల్ విన్ రికార్డు…

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లతో కూడిన గ్రూప్- బీ లీగ్ లో…హర్మన్ ప్రీత్ కౌర్ నాకయకత్వంలోని భారత జట్టు… నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ నెగ్గడం ద్వారా… టాపర్ గా నిలిచింది.

ప్రారంభమ్యాచ్ లో… పవర్ ఫుల్ న్యూజిలాండ్ ను భారత్ అలవోకగా ఓడించడం ద్వారా తొలి సంచలనం నమోదు చేసింది.

ఆ తర్వాత జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను భారత్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఇక …మూడోరౌండ్లో ఐర్లాండ్ ను 52 పరుగుల తేడాతో అధిగమించడం ద్వారా భారత్ నాకౌట్ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొంది.

గ్రూప్ టాపర్ ను నిర్ణయించే నాలుగోరౌండ్ మ్యాచ్ లో… భారత్ 48 పరుగుల తేడాతో… మూడుసార్లు ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాను కంగు తినిపించింది.

ఆసీస్ పై తొలిగెలుపు….

భారత జట్టు…గ్రూప్ దశలో ఆడిన మొత్తం నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లోనూ నెగ్గి 8 పాయింట్లతో టాపర్ స్థానం దక్కించుకొంది. అంతేకాదు…ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా టీ-20 ప్రపంచకప్ లో.. భారత్ కు ఇదే తొలిగెలుపు కావడం మరో విశేషం.

సెయింట్ లూషియాలోని డారెన్ సామీ స్టేడియం వేదికగా గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో….గ్రూప్ -ఏ టాపర్ విండీస్ తో… గ్రూప్ -బీ రన్నరప్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.

శుక్రవారం రెండో సెమీస్…

ఇక… డారెన్ సామీ స్టేడియం వేదికగానే శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో…. గ్రూప్-ఏ రన్నరప్ ఇంగ్లండ్ తో … గ్రూప్ -బీ టాపర్ భారత్ తలపడనుంది.

2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో… ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి…ప్ర స్తుత టీ-20 ప్రపంచకప్ సెమీస్ లోనే బదులు తీర్చుకొనే అవకాశం… భారత జట్టుకు దక్కింది.

28 వికెట్లతో భారత స్పిన్నర్ల షో…

ప్రపంచకప్ గ్రూప్ బీ-లీగ్ నాలుగురౌండ్లలో… భారత బౌలర్లు సాధించిన మొత్తం 30 వికెట్లలో… స్పిన్నర్లే 28 వికెట్లు పడగొట్టడం విశేషం.

ఇంగ్లండ్ తో జరిగే సెమీస్ లో సైతం భారత్..స్పిన్ బౌలింగే ఆయుధంగా…విజయానికి ఉరకలేస్తోంది. గతంలో 2009, 2010 ప్రపంచకప్ టోర్నీల సెమీస్ కు చేరిన భారత్… ఇప్పుడు మూడోసారి సెమీస్ చేరడం ద్వారా తన రికార్డును మరింత మెరుగు పరచుకొంది.

ప్రతిభకు అదృష్టం తోడైతే… తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్స్ చేరడం… హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టుకు ఏమంత కష్టం కాబోదు.

Tags:    
Advertisement

Similar News