కులం ముసుగులో వస్తే చెంప పగల గొట్టండి.... టీడీపీని ఉద్దేశించి కేసీఆర్ కామెంట్స్
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయన్నారు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతూనే ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మైనస్ అవుతుందని నేతలకు చెప్పానన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌కు ప్లస్ అవుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్… […]
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలే వచ్చాయన్నారు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతూనే ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మైనస్ అవుతుందని నేతలకు చెప్పానన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌కు ప్లస్ అవుతుందన్నారు.
ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్… ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని శక్తులు, వ్యక్తులు స్వార్థం కోసం కొన్ని అంశాలను తెరపైకి తెస్తుంటారని.. కానీ వాటిని పట్టుకుని కొట్టుకు పోవద్దని సూచించారు. మనుషులెవరూ శాశ్వతం కాదని… రాష్ట్రమే శాశ్వతమన్నారు.
రాష్ట్రం కోసమే ఆలోచించి విచక్షణతో ఓటేయాలని కోరారు. నిజం పునాది మీద ఓటు వేయాలే గానీ…. కులం పునాదిపై ఓటు వేయవద్దన్నారు. ఒక కులం నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మొత్తం ఆ కులంలోని దరిద్రం పోతుందా అని ప్రశ్నించారు. కాబట్టి కులం చూసి ఓటేయవద్దన్నారు.
కులం ముసుగులో వచ్చేవారికి ఖమ్మం ప్రజలు చెంప చెళ్ళు మనిపించి బుద్ధి చెప్పాలన్నారు. కులాల ఆధారంగా ఓట్లు అడగడం పద్దతేనా అని ప్రశ్నించారు కేసీఆర్. ఖమ్మంకు పెద్ద ప్రమాదం రాబోతోందన్నారు. 150 కిలోమీటర్లు ఖమ్మం జిల్లాలో గోదావరి ప్రవహిస్తున్నా కూడా ఖమ్మం జిల్లాలో ఎందుకు కరువు ఉందో కాంగ్రెస్, టీడీపీ మేధావులు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు మనిషి అయిన నామా నాగేశ్వరరావుకు ఓటేసేందుకు ఖమ్మం ప్రజలు ఏమైనా గొర్రెలా అని ప్రశ్నించారు.