టికెట్ల గోల.... ఉత్తమ్‌పై మర్రి శశిధర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

తెలంగాణలో మహాకూటమి నుంచి ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. ఇంకా కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీకి టికెట్లు కేటాయించిన చోట్ల కాంగ్రెస్‌ పాత నేతలు రెబల్స్‌గా దిగుతున్నారు. టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటున్నారు. చివరకు కూకట్‌పల్లిలో హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినికి కూడా ఇదే తరహ హెచ్చరికలు కాంగ్రెస్ నుంచి వచ్చాయి. సుహాసినికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో కూకట్‌పల్లిలో ఆమెను ఓడించి తీరుతామని కాంగ్రెస్ స్థానిక నేతలు శపథం చేశారు. ఈ కుమ్ములాటలు నియోజకవర్గ […]

Advertisement
Update:2018-11-18 04:38 IST

తెలంగాణలో మహాకూటమి నుంచి ఇప్పటికీ పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. ఇంకా కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీకి టికెట్లు కేటాయించిన చోట్ల కాంగ్రెస్‌ పాత నేతలు రెబల్స్‌గా దిగుతున్నారు.

టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటున్నారు. చివరకు కూకట్‌పల్లిలో హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినికి కూడా ఇదే తరహ హెచ్చరికలు కాంగ్రెస్ నుంచి వచ్చాయి.

సుహాసినికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో కూకట్‌పల్లిలో ఆమెను ఓడించి తీరుతామని కాంగ్రెస్ స్థానిక నేతలు శపథం చేశారు. ఈ కుమ్ములాటలు నియోజకవర్గ స్థాయి నేతల్లోనే కాదు… సీనియర్ నేతల మధ్య కూడా నడుస్తున్నాయి.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్‌ రెడ్డి… పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు సనత్‌ నగర్‌ టికెట్‌ రాకపోవడంతో శనివారం మీడియాతో మాట్లాడిన శశిధర్‌ రెడ్డి… తనకు టికెట్‌ దక్కకుండా ఉత్తమ్ కుమార్‌ రెడ్డే కుట్ర చేశారని ఆరోపించారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి వల్లే తనకు సనత్‌నగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాలేదన్నారు. సికింద్రాబాద్ టికెట్ ఇచ్చినా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు.

మర్రి శశిధర్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చినట్లయితే గెలవలేరని, సర్వే నివేదిక కూడా ఆ విధంగా వచ్చిందని ఉత్తమ్ ఇటీవల పార్టీ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ ముందు వాదించి తనకు టిక్కెట్ రాకుండా చేశారని శశిధర్ రెడ్డి మీడియాతో చెప్పారు.

సనత్‌ నగర్ టిక్కెట్ కావాలని టీడీపీ కోరకపోయినా, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే బలవంతంగా అంటగట్టారని ఆరోపించారు. కేవలం తనకు టికెట్ దక్కకుండా చేసేందుకే ఉత్తమ్ ఈ పనిచేశారని విమర్శించారు.

నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసేలోగా పార్టీ అధిష్టానం పునరాలోచన చేసి తనకు సనత్ నగర్‌ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వలేకపోయామని చెప్పి ఉంటే తాను అర్థం చేసుకునే వాడినని.. కానీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి స్క్రీనింగ్ కమిటీ ముందు శశిధర్‌ రెడ్డికి టికెట్ ఇస్తే గెలవడని గట్టిగా వాదించడమే తనకు నచ్చలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News