చంద్రబాబుకు సిగ్గుందా ?
హత్యాయత్నం నుంచి బయటపడ్డ జగన్‌ను కేసీఆర్, కేటీఆర్‌లు ఫోన్ చేసి పరామర్శించడాన్ని చంద్రబాబు తప్పుపట్టడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబుకు కనీస మానవత్వం లేదా అని నిలదీశారు. మనుషుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు చిల్లర రాజకీయాలు, భ్రష్టుపట్టిన రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ జగన్ పై హత్యాయత్నం గురించి ఆరా తీస్తే తప్పేంటన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు ఇతర పార్టీల నేతలు పరామర్శించలేదా అని ప్రశ్నించారు. హోదా […]
హత్యాయత్నం నుంచి బయటపడ్డ జగన్‌ను కేసీఆర్, కేటీఆర్‌లు ఫోన్ చేసి పరామర్శించడాన్ని చంద్రబాబు తప్పుపట్టడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబుకు కనీస మానవత్వం లేదా అని నిలదీశారు. మనుషుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు చిల్లర రాజకీయాలు, భ్రష్టుపట్టిన రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్ జగన్ పై హత్యాయత్నం గురించి ఆరా తీస్తే తప్పేంటన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు ఇతర పార్టీల నేతలు పరామర్శించలేదా అని ప్రశ్నించారు. హోదా అడిగినందుకే ఇవన్నీచేస్తున్నారని చంద్రబాబు చెప్పడానికి సిగ్గుండాలన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి సిగ్గులేకుండా తిరిగింది చంద్రబాబు కాదా అని వ్యాఖ్యానించారు.
హోదా ఏమైనా సంజీవినా అని మాట్లాడినోడు ఎవరు అని తలసాని అన్నారు. టీడీపీతో తాను 30 ఏళ్లు ఉన్నానని అక్కడ నడిచే డ్రామా రాజకీయాల గురించి తనకు బాగా తెలుసన్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్ చూసిన తర్వాత చాలా బాధేసిందన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే డీజీపీకి గవర్నర్ ఫోన్ చేయడం తప్పా అని ప్రశ్నించారు.
అంటే చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారా అని తలసాని నిలదీశారు. వ్యవస్థలన్నీ చేతుల్లో ఉన్నాయని ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు జగన్‌ను పరామర్శించేందుకు రావడం లేదని నిలదీశారు. ఒక బాధ్యత కలిగిన డీజీపీ దాడి చేసిన వాడు జగన్ అభిమాని అని వెంటనే ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు. మనుషులు చచ్చిపోయినా డ్రామాలే చేస్తామని చంద్రబాబు చెబితే అది ఆయన కర్మ అని అన్నారు తలసాని.