సీబీఐ డైరెక్టర్‌ను ఎలా తొలగిస్తారు?

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా… ఆయన తొలుత సీబీఐలోకి ఎంటరైంది వెంకయ్యనాయుడు సాయంతో అని…. ప్రస్తుత డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లు సెలవుపై వెళ్లే పరిస్థితిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది ఇద్దరు టీడీపీ ఎంపీలు అని…. అవినీతి ఆరోపణలు ఉన్నా సరే నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా సిఫార్పు చేసింది కేవీ చౌదరి ఆధ్వర్యంలోని సీవీసీ అన్నది సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధుల వద్ద ఆఫ్‌లైన్ లో […]

Advertisement
Update:2018-10-25 03:32 IST

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా… ఆయన తొలుత సీబీఐలోకి ఎంటరైంది వెంకయ్యనాయుడు సాయంతో అని…. ప్రస్తుత డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లు సెలవుపై వెళ్లే పరిస్థితిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది ఇద్దరు టీడీపీ ఎంపీలు అని…. అవినీతి ఆరోపణలు ఉన్నా సరే నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా సిఫార్పు చేసింది కేవీ చౌదరి ఆధ్వర్యంలోని సీవీసీ అన్నది సీబీఐ అధికారులు మీడియా ప్రతినిధుల వద్ద ఆఫ్‌లైన్ లో చెబుతున్నారు. ఇంత చేసిన చంద్రబాబు ఇప్పుడు తనకేం సంబంధం లేదన్న కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను సెలవుపై పంపడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఏ చట్టం కింద, ఏ అధికారం కింద సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని చంద్రబాబు ప్రశ్నించారు. సీబీఐలో ఇలాంటి పరిణామాలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. అవినీతిని అరికట్టాల్సిన వారే అవినీతిలో భాగస్వామ్యం కావడం పతనానికి పరాకాష్ట అని చెప్పారు.

మోడీ పాలనతో సీబీఐ భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. సీబీఐ డైరెక్టర్‌ను తొలగించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నిష్ఫక్షపాతంగా ఉండాల్సిన ఏ వ్యవస్థను మోడీ ప్రభుత్వం బతకనిచ్చేలా లేదని చంద్రబాబు విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News