30వేల కోట్ల జనం సొమ్ము అనిల్ అంబానీ జేబులోకి

రాఫెల్ స్కాంను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దాదాపు 30వేల కోట్ల జనం సొమ్మును అనిల్ అంబానీ జేబులోకి మోడీ పోశారని సంచలన ఆరోపణలు చేశాడు. రాజస్థాన్ లో ఈ మధ్యాహ్నం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీని ఏకిపారేశాడు రాహుల్ గాంధీ. ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్ సంస్థను కాదని రాఫెల్ విమానాల ధరను మూడు రెట్లు పెంచి 30వేల కోట్లను అనిల్ అంబానీకి గంపగుత్తగా అప్పగించేశాడని మండిపడ్డారు. […]

Advertisement
Update:2018-10-24 11:09 IST

రాఫెల్ స్కాంను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దాదాపు 30వేల కోట్ల జనం సొమ్మును అనిల్ అంబానీ జేబులోకి మోడీ పోశారని సంచలన ఆరోపణలు చేశాడు. రాజస్థాన్ లో ఈ మధ్యాహ్నం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీని ఏకిపారేశాడు రాహుల్ గాంధీ.

ప్రభుత్వ రంగ హెచ్ఏఎల్ సంస్థను కాదని రాఫెల్ విమానాల ధరను మూడు రెట్లు పెంచి 30వేల కోట్లను అనిల్ అంబానీకి గంపగుత్తగా అప్పగించేశాడని మండిపడ్డారు. రాఫెల్ కాంట్రాక్టును స్వయంగా మోడీనే అనిల్ అంబానీకి ఇవ్వాలని ప్రాన్స్ ప్రభుత్వానికి చెప్పాడని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.

మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి అనిల్ అంబానీని వెంట తీసుకెళుతాడని…. అక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులు కుదుర్చుకొని అనిల్ అంబానీకి వాటిని అప్పగిస్తాడని రాహుల్ ఆరోపించారు.

గబ్బర్ సింగ్ లా మోడీ జనం నుంచి పన్నులు వసూలు చేస్తున్నాడని…. పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచుతూ ఎవరు ఎంత మొత్తుకుంటున్నా స్పందించడం లేదని రాహుల్ మండిపడ్డారు.

జనం సొమ్మును లూటీ చేస్తున్న మోడీని ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాజస్థాన్ లో పటేళ్ల భూములను అనిల్ అంబానీకి కేటాయించారని రాహుల్ ఆరోపించారు. భూమి, నీరు, వనరులను కార్పొరేట్లకు పంచుతూ పేదల కడుపుకొడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రాజస్థాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News