సీఎం రమేష్‌ రాజప్రసాదంలో హంగులు చూసి ఆశ్చర్యం....

చంద్రబాబు బినామీగా భావించే టీడీపీ ఎంపీ సీఎం రమేష్ లగ్జరీ లైఫ్ తెరపైకి వచ్చింది. ఐటీ దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీఎం రమేష్ ఇంటి దృశ్యాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీఎం రమేష్ లగ్జరీ హౌజ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది వరకే అవి గూగుల్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఐటీ రైడ్స్ నేపథ్యంలో నెటిజన్లు విపరీతంగా వాటిని వీక్షిస్తున్నారు.     రాత్రివేళల్లో సీఎం రమేష్ భవంతి ఒక రాజ్‌మహల్‌లా వెలుగులు చిమ్ముతోంది. సారా […]

Advertisement
Update:2018-10-13 06:40 IST

చంద్రబాబు బినామీగా భావించే టీడీపీ ఎంపీ సీఎం రమేష్ లగ్జరీ లైఫ్ తెరపైకి వచ్చింది. ఐటీ దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీఎం రమేష్ ఇంటి దృశ్యాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సీఎం రమేష్ లగ్జరీ హౌజ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది వరకే అవి గూగుల్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఐటీ రైడ్స్ నేపథ్యంలో నెటిజన్లు విపరీతంగా వాటిని వీక్షిస్తున్నారు.

 

 

రాత్రివేళల్లో సీఎం రమేష్ భవంతి ఒక రాజ్‌మహల్‌లా వెలుగులు చిమ్ముతోంది. సారా వ్యాపారంతో జీవితం మొదలుపెట్టి చంద్రబాబుకు దగ్గరై…. ఆయన సీఎంగా ఉన్న సమయంలో వేల కోట్ల కాంట్రాక్టులు సొంతం చేసుకున్న సీఎం రమేష్ లగ్జరీలో ఎక్కడా తగ్గినట్టు కనిపించడం లేదు.

 

 

 

ఆయన ఇంటిలో స్మిమ్మింగ్ పూల్, హోంథియేటర్, కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో బాత్‌రూములు, బెడ్‌రూంలు ఉన్నాయి. పై అంతస్తుల్లోనూ స్మిమ్మింగ్ పూల్‌ నిర్మించుకున్నారు సీఎం రమేష్. సీఎం రమేష్ ఇంట్లోకి వెళ్లిన ఐటీ అధికారులు చాలాసేపు అక్కడ లగ్జరీ వ్యవహారాలను చూస్తూ ఉండిపోయారని చెబుతున్నారు. ఈ రాజప్రసాదం లాంటి సీఎం రమేష్ ఇల్లు జూబ్లి హిల్స్‌లో ఉంది. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

 

 

 

 

Tags:    
Advertisement

Similar News