కేసీఆర్, కేటీఆర్ పకడ్బందీ ప్లాన్.... అయినా ఎలా ఫెయిల్ అయ్యిందబ్బా?

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. మాట వినని వారిని లూప్ లైన్‌ పోస్టులకు పంపారనే ప్రచారం జరిగింది. తనకు అనుకూలురైన వారిని మంచి స్థానాల్లో నియమించారని వార్తలొచ్చాయి. ముందస్తు ఎన్నికలకు వెళితే అధికారం చెలాయించడం కుదరదు. అందుకే తమకు అనుకూలమైన అధికారులుంటే పనులు చేసుకోవచ్చు… లబ్ధి పొందవచ్చని కేసీఆర్ ఆలోచించారు. అన్నట్టే అప్పుడూ, ఇప్పుడు పరిణామాలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని […]

Advertisement
Update:2018-10-04 12:30 IST

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. మాట వినని వారిని లూప్ లైన్‌ పోస్టులకు పంపారనే ప్రచారం జరిగింది. తనకు అనుకూలురైన వారిని మంచి స్థానాల్లో నియమించారని వార్తలొచ్చాయి. ముందస్తు ఎన్నికలకు వెళితే అధికారం చెలాయించడం కుదరదు. అందుకే తమకు అనుకూలమైన అధికారులుంటే పనులు చేసుకోవచ్చు… లబ్ధి పొందవచ్చని కేసీఆర్ ఆలోచించారు. అన్నట్టే అప్పుడూ, ఇప్పుడు పరిణామాలు కొనసాగుతున్నాయి.

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట.. ఇందుకోసం అధికారులను సైతం ఈసీ పడగనీడ పడకుండా అమలు చేయాలని కోరాడట.. దీంతో అధికారులు సైతం చాలా పకడ్బందీగానే వ్యవహరించారు. ఎన్నికల ముందు ‘రైతుబంధు’, బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మైలేజ్ పొందాలని టీఆర్ఎస్ భావించింది.

ఇందుకు గాను వాటిపై కేసీఆర్, ఇతర మంత్రుల ఫొటోలు తీసి కోడ్ ఉల్లంఘన లేకుండా పంచాలని చూశారు. రైతుబంధు చెక్కులతోపాటు, తెలంగాణ బతుకమ్మ చీరలపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను తీసివేసి పంచేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారట.

సిరిసిల్లలో రూపుదిద్దుకున్న బతుకమ్మ చీరలపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు తీసేసి పంచాలని స్వయంగా కేటీఆర్ చూసే శాఖను నడిపిస్తున్న పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉండే ఈయన ఈసీని ఒప్పించి మరీ బతుకమ్మ చీరల పంపిణీకి రెడీ అయ్యారు. బుధవారం సాయంత్రం డిస్ పాచ్ అయ్యే సమయానికి ఎన్నికల కమీషన్ నుంచి బ్రేక్ వచ్చింది. తెలంగాణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇక్కడి టీఆర్ఎస్ సమన్వయంతో వెళుతున్నాయి. కేసీఆర్ కోరినట్టే అంతా జరుగుతోంది. కాంగ్రెస్ కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. కేసీఆర్ రైతుబంధు, తెలంగాణ బతుకమ్మ చీరలపై బహిరంగంగా నో చెప్పడం లేదు. తెరవెనుక మాత్రం ఫిర్యాదులు చేస్తోంది. మరి అంతా సాఫీగా అధికారుల సాయంతో కానిచ్చేసి లబ్ధి పొందాలనుకున్న కేసీఆర్, కేటీఆర్ లకు ఈసీ షాకిచ్చింది.

బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసింది. దీని వెనుక ఎవరున్నారు.? ఈసీని మేనేజ్ చేసేంత స్థాయి వ్యక్తి ఎవరనేది ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాష్ట్ర అధికారుల చేత మరోసారి ఈసీకి చెప్పించి బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి టీఆర్ఎస్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం.

Tags:    
Advertisement

Similar News