మావోయిస్టుల దాడిలో మాజీ ఎమ్మెల్యే కూడా మృతి

విశాఖ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య చేశారు. దాదాపు 50 మంది మావోయిస్టులు దాడిలో పాల్గొని ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ పైనా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన కూడా కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. బాక్సైట్‌ తవ్వకాలు, అక్రమ మైనింగ్ విషయంలో మావోయిస్టులు చాలాకాలంగా కిడారిని హెచ్చరిస్తున్నారు. తనకు చెందిన క్వారీ వద్దకు ఎమ్మెల్యే […]

Advertisement
Update:2018-09-23 08:15 IST

విశాఖ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును హత్య చేశారు. దాదాపు 50 మంది మావోయిస్టులు దాడిలో పాల్గొని ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయారు.

మాజీ ఎమ్మెల్యే శివేరి

అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ పైనా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన కూడా కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. బాక్సైట్‌ తవ్వకాలు, అక్రమ మైనింగ్ విషయంలో మావోయిస్టులు చాలాకాలంగా కిడారిని హెచ్చరిస్తున్నారు. తనకు చెందిన క్వారీ వద్దకు ఎమ్మెల్యే వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు

క్వారీ వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే కారును దారిలో ఆపి.. కిందకు దింపి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావేనని నిర్ధారించుకున్న తర్వాతే కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన కిడారి అనంతరం టీడీపీలోకి వెళ్లిపోయారు. ఈ దాడితో పోలీసులు ఉలిక్కిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News