2018 ఆసియా కప్ లో ధోనీ కొత్త అవతారం

టీమిండియా మెంటార్ గా ధోనీసేవ యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన ధోనీ 321 వన్డేల్లో 10వేల 46 పరుగుల ధోనీ ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో…. టీమిండియా తన గ్రూప్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఆడక ముందే… వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, టీమ్ మేనేజ్ మెంట్ ఇతర సభ్యులు, శిక్షణ సిబ్బంది… సకాలంలో దుబాయ్ కి రాలేకపోడంతో…. ధోనీ జట్టు మెంటార్ గా బాధ్యతలు […]

Advertisement
Update:2018-09-18 12:24 IST
  • టీమిండియా మెంటార్ గా ధోనీసేవ
  • యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన ధోనీ
  • 321 వన్డేల్లో 10వేల 46 పరుగుల ధోనీ

ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో…. టీమిండియా తన గ్రూప్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఆడక ముందే… వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, టీమ్ మేనేజ్ మెంట్ ఇతర సభ్యులు, శిక్షణ సిబ్బంది… సకాలంలో దుబాయ్ కి రాలేకపోడంతో…. ధోనీ జట్టు మెంటార్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.

జట్టులోని యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాడు. అబూదాబీ, దుబాయ్ స్టేడియాల పిచ్ తీరుతెన్నులు, ఎమరేట్స్ వాతావరణ పరిస్థితులపై తనకున్న అవగాహనను సహ ఆటగాళ్లతో పంచుకొన్నాడు.
హాంకాంగ్ తో మ్యాచ్ కు సన్నాహాలలో … టీమిండియా నెట్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో ధోనీ చురుగ్గా వ్యవహరించాడు. 37 ఏళ్ల వయసులో … అపారఅనుభవం ఉన్న టీమిండియా ఆటగాడిగా ధోనీ… బౌలర్లకు సైతం విలువైన సలహాలు ఇచ్చాడు.

కెప్టెన్ గా టీమిండియాకు టీ-20, వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ మినీ ప్రపంచకప్ లు అందించిన మొనగాడు ధోనీ మాత్రమే.ఇప్పటి వరకూ ఆడిన 321 వన్డేలలో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో 10వేల 46 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

Tags:    
Advertisement

Similar News