టీడీపీ బ్యాచ్‌ ఇలా దొరికిపోయింది...

ప్రత్యేక హోదా వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ప్రస్తుత పరిస్థితిలో ప్యాకేజ్‌ తీసుకోవడమే బెటర్. ఇది కేంద్రమంత్రి సుజనాచౌదరి పదేపదే చెప్పిన మాటలు. హోదాల వల్ల ఏం ఉపయోగాలున్నాయో నాకు  తెలియదు. ఇది టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చెబుతూ వచ్చిన డైలాగ్. అయితే వీరి అసలు రూపం వేరే ఉందని తేటతెల్లమైంది. హోదా వల్ల ప్రయోజనం ఉండదన్న వారు, హోదా లాభాల గురించి తెలియదన్న వారే ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాంచల్‌లో భారీగా […]

Advertisement
Update:2016-09-26 07:42 IST

ప్రత్యేక హోదా వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ప్రస్తుత పరిస్థితిలో ప్యాకేజ్‌ తీసుకోవడమే బెటర్. ఇది కేంద్రమంత్రి సుజనాచౌదరి పదేపదే చెప్పిన మాటలు. హోదాల వల్ల ఏం ఉపయోగాలున్నాయో నాకు తెలియదు. ఇది టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చెబుతూ వచ్చిన డైలాగ్. అయితే వీరి అసలు రూపం వేరే ఉందని తేటతెల్లమైంది. హోదా వల్ల ప్రయోజనం ఉండదన్న వారు, హోదా లాభాల గురించి తెలియదన్న వారే ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాంచల్‌లో భారీగా పరిశ్రమలు స్థాపించారు. ఆ విషయాన్ని పత్రాలతో సహా బయటకు వచ్చాయి. ఉత్తరాంచల్‌లో ప్రత్యేక హోదా లాభాలను దక్కించుకోవడంలో సుజనాచౌదరి అందరి కంటే ముందున్నారు. ఉత్తరాంచల్‌లో హోదా కారణంగా లభిస్తున్న రాయితీల వల్ల వ్యాపారం చాలా లాభసాటిగా ఉందని స్వయంగా 2006లో సుజనాచౌదరే కంపెనీ చైర్మన్ హోదాలో వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్లు ఇప్పటికీ ఆయన కంపెనీ వెబ్‌సైట్లో ఉన్నాయి. న్యూ ల్యాండ్స్ ఇండస్ట్రీస్‌ పేరుతో సుజనా ఉత్తరాంచల్‌లో కంపెనీలు స్థాపించారు.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌… ఉత్తరాంచల్‌కు ప్రత్యేక హోదా ఉండడంతో అక్కడ అమరరాజా బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు భారీగా భూములుకొన్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు. సీఎం రమేష్‌, జేసీ దివాకర్ రెడ్డి, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులు కూడా 2006లో ఉత్తరాంచల్‌కు ప్రత్యేక హోదా రాగానే అక్కడికి వెళ్లి పరిశ్రమలు పెట్టారు. గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు ఉత్తరాంచల్‌లోని హరిద్వార్ సమీపంలో శివశక్తి బయో ప్లాంటెక్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ ప్రారంభించారు. వీరంతా ఉత్తరాంచల్‌ వెళ్లి పరిశ్రమలు పెట్టడానికి కారణం ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదానే. ప్రత్యేక హోదా అంతటి ఉపయోగం ఉందని తెలిసి కూడా సుజనాచౌదరి, ఇతర టీడీపీ నేతలు ప్రత్యేక ప్యాకేజ్‌ను స్వాగతించడం గమ్మత్తుగా ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News