హైకోర్టు ఆదేశాలతో ప్రతిపక్షాల పండగ!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు చేయడంతో ప్రతిపక్షాలు పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులను తప్పుబడుతూ టీడీపీ శాసనసభా పక్షం విలీనం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుండా విలీనం ప్రక్రియను పూర్తిచేయడాన్ని కూడా తప్పుబట్టింది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నేతలు పండగ చేసుకుంటున్నారు. మార్చి 13న అసెంబ్లీలో తెలుగుదేశం నుంచి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అసెంబ్లీ శాఖని […]
Advertisement
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు చేయడంతో ప్రతిపక్షాలు పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులను తప్పుబడుతూ టీడీపీ శాసనసభా పక్షం విలీనం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుండా విలీనం ప్రక్రియను పూర్తిచేయడాన్ని కూడా తప్పుబట్టింది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నేతలు పండగ చేసుకుంటున్నారు. మార్చి 13న అసెంబ్లీలో తెలుగుదేశం నుంచి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అసెంబ్లీ శాఖని టీఆర్ ఎస్‌లో విలీనం చేస్తున్నామని లేఖ ఇచ్చారు. దానికి వెంటనే అసెంబ్లీ ఆమోదం లభించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. మొత్తానికి ఫిరాయింపులపై 3 నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్, వైస్సార్‌సీపీలు కూడా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి. స్పీకర్ 3 నెలలు కాదు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
కోర్టు తీర్పు స్పీకర్‌కు వర్తిస్తుందా? అన్నదే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. స్పీకర్‌ను ఆదేశించేలా మార్గదర్శకాలుజారీ చేసే అధికారాలు దేశంలో ఏ న్యాయవ్యవస్థకూ లేదు. ఏపీలో ఎమ్మెల్యే రోజా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా అవేమీ అమలుకాలేదన్న సంగతి తెలిసిందే! నిన్న హైకోర్టులో అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విలీన నిర్ణయానికి స్పీకర్‌కు సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. స్పీకర్‌కు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోజాలదని గుర్తు చేశారు. దీంతో ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టుఆదేశాలు అమలుకు నోచుకుంటాయా? లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.
Advertisement