ఈనాడు కాపర్‌ కథ... మరో జిమ్మిక్కు సిద్ధమైన చంద్రబాబు

రాయలసీమకు నీరిచ్చేందుకు, పోలవరానికి తాత్కాలిక ప్రత్యామ్నాయం అంటూ పట్టిసీమ పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టి, ముఖ్యంగా రాయలసీమ వాసులను వెర్రిపప్పలను చేసి వందల కోట్లతో పండుగ చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు పోలవరంపై జిమ్మిక్కు మొదలుపెట్టారు. కేంద్రం పరిధిలోని పోలవరం ప్రాజెక్టును పట్టుబట్టి రాష్ట్రానికి తెచ్చుకున్న చంద్రబాబు… ప్రాజెక్ట్ బదిలీ అవగానే తన పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీకి 1,450కోట్లు అదనంగా సమర్పించారు. అంతటితో ఆగలేదు బాబు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రాజెక్టు స్థలాన్ని […]

Advertisement
Update:2016-09-14 10:14 IST

రాయలసీమకు నీరిచ్చేందుకు, పోలవరానికి తాత్కాలిక ప్రత్యామ్నాయం అంటూ పట్టిసీమ పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టి, ముఖ్యంగా రాయలసీమ వాసులను వెర్రిపప్పలను చేసి వందల కోట్లతో పండుగ చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు పోలవరంపై జిమ్మిక్కు మొదలుపెట్టారు. కేంద్రం పరిధిలోని పోలవరం ప్రాజెక్టును పట్టుబట్టి రాష్ట్రానికి తెచ్చుకున్న చంద్రబాబు… ప్రాజెక్ట్ బదిలీ అవగానే తన పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీకి 1,450కోట్లు అదనంగా సమర్పించారు. అంతటితో ఆగలేదు బాబు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి మంగళవారం ప్రకటించారు. అయితే చంద్రబాబు అంత ఆత్మవిశ్వాసంతో 2018కే పోలవరం పూర్తి చేస్తామని ఎలా చెప్పారన్న అనుమానానికి బాబు ఆస్థాన పత్రిక ఈనాడు స్పష్టత ఇచ్చింది. చంద్రబాబు ప్రస్తుతానికి కాపర్ డ్యాం నిర్మిస్తారట. మంగళవారం పోలవరం నిర్మాణంపై సమీక్ష సందర్భంగా చంద్రబాబే స్వయంగా కాపర్ డ్యాం ఆలోచన వెల్లడించారని ఈనాడు మెచ్చుకుంది.

కాపర్ డ్యాం ఎత్తును 41 మీటర్లకు పెంచడం ద్వారా కాలువకు 6 మీటర్ల ఎత్తులో నీరు అందిస్తారట. ఇలా చేయడం ద్వారా 60 టీఎంసీల నీటిని మళ్లించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. తదనుగుణంగా ఇప్పటినుంచే పునరావాస పనులు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారట. నిజానికి పోలవరం ప్రధాన డ్యాం +53 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంది. ఆ మేరకు భూసేకరణ, పునరావాసం పూర్తి చేయాలంటే రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలా కాకుండా ప్రస్తుత కాపర్‌ డ్యాం ఎత్తు +41 మేరకు నిర్మిస్తే ఖర్చు బాగా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతున్నట్టు ఈనాడు కథనం. కాపర్ డ్యాం ఎత్తు మేర ముంపు ప్రాంతాల పునరావాసం పూర్తి చేయాలంటే రూ. 6 వేల కోట్లు నుంచి రూ. 7 వేల కోట్లతో సరిపెట్టవచ్చని ఈనాడు చెబుతోంది. కాపర్ డ్యాంకు, ప్రధాన డ్యాంకు పెద్దగా తేడా ఉండదని కూడా ఈనాడు రాసుకొచ్చింది. కాపర్ డ్యాంను 100 ఏళ్లలో గరిష్టంగా వచ్చే వరదను తట్టుకునేలా నిర్మిస్తారని… అదే ప్రధాన డ్యాం అయితే 10వేల సంవత్సరాల్లో గరిష్టంగా వచ్చే వరదను తట్టుకునేలా నిర్మిస్తారని ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. ఈనాడు , చంద్రబాబు వాలకం చూస్తుంటే … ప్రత్యేక హోదా, ప్యాకేజ్ రెండు సమానమే అన్నట్టు కాపర్‌ డ్యాంతో సరిపెట్టుకుంటే పోలా అంటారేమో!. కేంద్రం పరిధిలోని ప్రాజెక్టును తమచేతుల్లోకి తెచ్చుకున్న ఏపీ ప్రభుత్వం… కొత్తగా కాపర్‌ డ్యాం పరిధిగా చూపెట్టడంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు హఠాత్తుగా కాపర్ డ్యాం కథను చెప్పడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో దురుద్దేశం ఉంటుందని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News