గాంధీ హత్య ఆరెస్సెస్‌కు ముందే తెలుసా?
మహాత్మా గాంధీ హత్య విషయం ఆరెస్సెస్ కు ముందే తెలుసా? గాంధీ హత్య తరువాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారా? అవుననే అంటున్నారు ఎస్పీ నేత బేణిప్రసాద్ వర్మ. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎస్పీ అధినేత అఖిలేశ్ సంకేతాలివ్వగానే.. ఎస్పీ సీనియర్ నేత ఆరెస్సెస్‌పై విరుచుకుపడటం గమనార్హం. తాజాగా గాంధీజీ హత్యపై బేణి ప్రసాద్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ హత్య విషయం సంఘ్ పరివార్‌కు ముందే తెలుసని ఈ మేరకు తన కేడర్‌ను […]
Advertisement
మహాత్మా గాంధీ హత్య విషయం ఆరెస్సెస్ కు ముందే తెలుసా? గాంధీ హత్య తరువాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారా? అవుననే అంటున్నారు ఎస్పీ నేత బేణిప్రసాద్ వర్మ. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎస్పీ అధినేత అఖిలేశ్ సంకేతాలివ్వగానే.. ఎస్పీ సీనియర్ నేత ఆరెస్సెస్‌పై విరుచుకుపడటం గమనార్హం. తాజాగా గాంధీజీ హత్యపై బేణి ప్రసాద్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ హత్య విషయం సంఘ్ పరివార్‌కు ముందే తెలుసని ఈ మేరకు తన కేడర్‌ను అలర్ట్ చేసిందని ఆరోపించారు. ఆయన హత్యకు ముందు శుభవార్త వినేందుకు సిద్ధంగా ఉండాలని రేడియో వార్తలు వినాలని వారికి సందేశం వచ్చిందని చెప్పారు.
గాంధీజీ హత్య తరువాత ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పటి హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ ఆ సంస్థను నిషేధించారన్నారు. మనదేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు వారికేదైనా అయితే.. కశ్మీర్ తరహా పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టాలని ఎస్పీ భావిస్తోంది. ఇందులో భాగంగానే.. హస్తంపార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీ ఆసక్తిగా ఉందని, ఆ విషయాన్ని బేణి ప్రసాద్ ద్వారా చెప్పించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement