కామన్ ప్లాట్ ఫాంపై కలవాల్సి రావచ్చు... అందుకే కర్టసీ మెయిన్ టైన్ చేస్తున్నా...
కేంద్రాన్ని, వెంకయ్యనాయుడిని గట్టిగా విమర్శిస్తున్న పవన్ కల్యాణ్.. చంద్రబాబు విషయంలో మాత్రం మెతక వైఖరితో ఉంటున్నారన్న విమర్శలపై తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్పందించారు. మనిషిని గౌరవించి మాట్లాడడం కూడా తప్పా అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కేంద్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన్ను విమర్శించాల్సి వస్తోందన్నారు. వెంకయ్యనాయుడు ప్రజలను మభ్యపెట్టారని పవన్ విమర్శించారు. చంద్రబాబును తాను సూటిగానే ప్రశ్నిస్తున్నానని… కానీ మిగిలిన వారికి ఎందుకు అర్థం కావడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను […]
కేంద్రాన్ని, వెంకయ్యనాయుడిని గట్టిగా విమర్శిస్తున్న పవన్ కల్యాణ్.. చంద్రబాబు విషయంలో మాత్రం మెతక వైఖరితో ఉంటున్నారన్న విమర్శలపై తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్పందించారు. మనిషిని గౌరవించి మాట్లాడడం కూడా తప్పా అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కేంద్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన్ను విమర్శించాల్సి వస్తోందన్నారు. వెంకయ్యనాయుడు ప్రజలను మభ్యపెట్టారని పవన్ విమర్శించారు. చంద్రబాబును తాను సూటిగానే ప్రశ్నిస్తున్నానని… కానీ మిగిలిన వారికి ఎందుకు అర్థం కావడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను అనాగరికమైన భాష మాట్లాడనన్నారు. విధివిధానాల మీదే విమర్శలు చేస్తుంటానన్నారు. రేపుపొద్దున కామన్ ప్లాట్‌ఫాం మీద కలవాల్సి రావచ్చని అందుకే ఆ కర్టసి మెయిన్ టైన్ చేస్తున్నా అని పవన్ చెప్పారు. అది ఒక ప్రోటోకాల్ అని అన్నారు. ఒకరిని వ్యతిరేకించడం అంటే తిట్టుకోవడం కాదన్నారు.
కేంద్రం హుద్‌హుద్ తుఫాను సమయంలో ప్రకటించిన 150 కోట్లు విడుదల చేయడానికే చాలా కాలం పట్టిందని మరి లక్షా 50 వేల కోట్ల ప్యాకేజ్‌ను ఇవ్వడానికి ఎంతసమయం తీసుకుంటారో అని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్‌పై లోతుగా విశ్లేషణ చేస్తానన్నారు. సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీలో సొంత వ్యాపారాలకోసమే లాబీయింగ్ చేసుకుంటున్నారని మరోసారి ఆరోపించారు. తాను పోరాటం మొదలుపెడితే అది ఎంత స్థాయికైనా వెళ్లవచ్చన్నారు. హోదా సాధించేందుకు ఏం చేయబోతున్నారని ఇంటర్వ్యూలోనే మరో సందర్భంలో ప్రశ్నించగా… తాను హోదా సాధిస్తానని చెప్పడం లేదని… పోరాడుతానని మాత్రమే చెబుతున్నానన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించగా… తాను రిజర్వేషన్ల నినాదంపై రాలేదని, కాబట్టి కాపు రిజర్వేషన్లపై స్పందించనని చెప్పారు.
Click on Image to Read: