ఇదేమి అసెంబ్లీరా బాబూ!...ఒక వైపు కట్‌లు.. మరో వైపు తిట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకపక్షంగానే నడుస్తున్నట్టుగా ఉంది. గతంలో అసెంబ్లీలో గందరగోళం ఉన్నప్పుడు ఎవరికీ మైక్ ఇచ్చేవారు కాదు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగానే సభ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ మూడో రోజూ ప్రత్యేక హోదా అంశంపై స్తంభించిపోయింది. హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సాధారణంగా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు మార్షల్స్ సభలోకి వస్తుంటారు. కానీ ఎమ్మెల్యేల కంటే మార్షల్సే ముందుగా సభలోకి మోహరించారు. స్పీకర్ పోడియం వైపు రాకుండా మార్షల్స్ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకపక్షంగానే నడుస్తున్నట్టుగా ఉంది. గతంలో అసెంబ్లీలో గందరగోళం ఉన్నప్పుడు ఎవరికీ మైక్ ఇచ్చేవారు కాదు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగానే సభ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ మూడో రోజూ ప్రత్యేక హోదా అంశంపై స్తంభించిపోయింది. హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సాధారణంగా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు మార్షల్స్ సభలోకి వస్తుంటారు. కానీ ఎమ్మెల్యేల కంటే మార్షల్సే ముందుగా సభలోకి మోహరించారు. స్పీకర్ పోడియం వైపు రాకుండా మార్షల్స్ వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. మహిళా మార్షల్స్‌ను కూడా సభలోకి రప్పించారు. సభ నినాదాల మధ్య మారుమోగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌కు స్పీకర్ ఒకసారి మైక్ ఇచ్చారు.
జగన్ ”అధ్యక్షా” అనగానే మైక్ కట్ అయింది. ఇదేంటని ప్రశ్నించగా సభ ఆర్డర్‌లో ఉంటేనే మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. అయితే అదే సమయంలో అధికారపక్షానికి చెందిన టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు మైక్ తీసుకుని … ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్‌లు… జగన్‌ను ఫ్యాక్షనిస్ట్, రౌడీ అంటూ తిట్టిపోశారు. రౌడీల కంటే హీనంగా జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇంతలోనే మధ్యవర్తిగా పైకి లేచిన బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ప్రభుత్వం వైపే నిలబడ్డారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సూచించారు. ఇలాంటివారు సభలో ఉండకూడదన్నారు. స్పీకర్ దగ్గరకు వెళ్లి ఆందోళనలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత బోండా ఉమా లేచారు. అయనకూడా ఎప్పటిలాగే తనదైన పరుష పదజాలంతో విపక్షాన్ని టార్గెట్ చేశారు. జగన్ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతది ఫ్యాక్షన్ మెంటాలిటీ అని విమర్శించారు. రాయలసీమకు వెళ్లి కరువును పారద్రోలినవ్యక్తి చంద్రబాబు అని అన్నారు. బోండా ఉమా తనను దూషిస్తున్న సమయంలో జగన్ తన స్థానంలోనే కూర్చుని వింటూ ఉండిపోయారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీ అధికారపక్షం సొంత ఆస్తి అన్నట్టుగానే తయారైందని విమర్శకులు అంటున్నారు.
Click on Image to Read: