ఎందుకు జరపాలి? వెంకయ్యకు కవిత సూటిప్రశ్న
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ విషయంలో గులాబీ-కమలం మధ్య మాటల పోరు కొనసాగుతూనే ఉంది. విలీనమంటూ గులాబీ.. కాదు కాదు.. విమోచనమే నంటూ కమలం ఎవరికి వారు ప్రెస్‌మీట్లు పెట్టుకుని ఆరోపణలు – ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ చేసే ఆరోపణల కంటే తెలంగాణ రాష్ట్ర సమితి చేసే ప్రత్యారోపణల్లోనే ఎక్కువ ఘాటు కనిపిస్తోంది. ఈ విషయంలో ఎంపీ కవిత కూడా మరోసారి కేంద్రమంత్రి వెంకయ్యను నిలదీసింది. అసలు తెలంగాణ విమోచనాన్ని ఎందుకు […]
Advertisement
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ విషయంలో గులాబీ-కమలం మధ్య మాటల పోరు కొనసాగుతూనే ఉంది. విలీనమంటూ గులాబీ.. కాదు కాదు.. విమోచనమే నంటూ కమలం ఎవరికి వారు ప్రెస్‌మీట్లు పెట్టుకుని ఆరోపణలు – ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ చేసే ఆరోపణల కంటే తెలంగాణ రాష్ట్ర సమితి చేసే ప్రత్యారోపణల్లోనే ఎక్కువ ఘాటు కనిపిస్తోంది. ఈ విషయంలో ఎంపీ కవిత కూడా మరోసారి కేంద్రమంత్రి వెంకయ్యను నిలదీసింది. అసలు తెలంగాణ విమోచనాన్ని ఎందుకు నిర్వహించాలని సూటిగా ప్రశ్నించింది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలంగాణ సమాజాన్ని విమోచనం పేరిట విడదీసి హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని బీజేపీపై ఇటీవల మండిపడ్డ కవిత ఈసారి తన ఆరోపణలకు మరింత పదును పెట్టారు. 1999లో కాకినాడ సభలో చేసిన తీర్మానాన్ని బీజేపీ నేతలు ఎందుకు విస్మరించారో చెప్పాలని వెంకయ్యను డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ చేసిన మోసాన్ని తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడమంటే శ్రీకాంతాచారిలాంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రాణత్యాగాలకు విలువ లేకుండా పోతుందన్నారు. కవిత విమర్శలకు పువ్వు గుర్తుపార్టీ నేతలు ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.
Advertisement