బాబు సభలో చిలక పలుకులు అద్దె రైతులవా?
కరువు విషయంలోనూ చంద్రబాబు ఈవెంట్ మేనేజ్‌మెంట్ తరహాలో వ్యవహరిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కరువును జయించే పేరుతో అనంతపురంజిల్లాలో పర్యటించిన చంద్రబాబుతో మాట్లాడిన రైతులు కూడా ఫేక్ అని తేలింది. అంతా బాగుందని జనాన్ని నమ్మించేందుకు ట్రైయినింగ్ ఇచ్చి కొందరు వ్యక్తులతో వేదికలపై మాట్లాడించినట్టు తేలింది. ఆగస్ట్ 31న చంద్రబాబు అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం వీరాపురంలో పర్యటించారు. హెలికాప్టర్ దిగిన వెంటనే రైతు నాగప్ప పొలంలోకి వెళ్లి రెయిన్‌గన్స్ ఆన్ చేశారు. […]
కరువు విషయంలోనూ చంద్రబాబు ఈవెంట్ మేనేజ్‌మెంట్ తరహాలో వ్యవహరిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కరువును జయించే పేరుతో అనంతపురంజిల్లాలో పర్యటించిన చంద్రబాబుతో మాట్లాడిన రైతులు కూడా ఫేక్ అని తేలింది. అంతా బాగుందని జనాన్ని నమ్మించేందుకు ట్రైయినింగ్ ఇచ్చి కొందరు వ్యక్తులతో వేదికలపై మాట్లాడించినట్టు తేలింది. ఆగస్ట్ 31న చంద్రబాబు అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం వీరాపురంలో పర్యటించారు. హెలికాప్టర్ దిగిన వెంటనే రైతు నాగప్ప పొలంలోకి వెళ్లి రెయిన్‌గన్స్ ఆన్ చేశారు. అయితే పంట పరిస్థితిని వివరించే అవకాశం నాగప్పకు ఇవ్వకుండా టీడీపీకి అనుకూలుడైన గోవిందప్పకు ఇచ్చారు. రెయిన్ గన్‌లు, నీటి కుంటలు అద్బుతమని గోవిందప్ప మాట్లాడారు. అనంతరం సభావేదిక మీదకు పిలిచి కూడా గోవిందప్పతోనే మాట్లాడించారు. తనకు ఏడెకరాలకు పైగా పొలం ఉందని, అధికారుల సూచన మేరకు రెండు ఫారం పాండ్లు తవ్వుకున్నానని, రెయిన్ గన్‌ల సాయంతో తన పొలం పచ్చగా మారిందని చంద్రబాబు సమక్షంలో సభావేదిక నుంచి చెప్పారు. దీంతో మిగిలిన రైతులు కూడా గోవిందప్పను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అయితే గోవిందప్ప చెప్పిందంతా అబద్దమని తేలింది. గోవిందప్ప తన పొలంలో అసలు పంటే వేయలేదు. నీటి కుంటలు తవ్వలేదు, అసలు రెయిన్ గన్‌ల అవసరమే రాలేదు. దీనిపై అధికారులు మాత్రం గోవిందప్ప అయితే బాగా మాట్లాడుతాడని వేదికపైకి పంపామని సింపుల్‌గా చెబుతున్నారు. మొత్తానికి అనంతపురం జిల్లా కరువును చంద్రబాబు ఈ దారిలో జయించారన్న మాట.
Click on Image to Read: