ప్రాణభయం తప్పింది.. అసలు ముప్పు ముందుంది!
తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్‌కు కొంతకాలంగా గ్రహస్థితి బాగున్నట్లుగా లేదు. ఆయనను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లాడు. తరువాత బెయిల్ పై బయటికి వచ్చాడు. ఆ తరువాత తనకు భద్రత తగ్గిందని ఆందోళన చెందాడు. హైకోర్టును ఆశ్రయించాడు. కొందరు తనను చంపాలని చూస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశాడు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదన్నాడు. ఏపీ సీఎం సాయంతో కేంద్ర హోంమంత్రి దాకా విషయాన్ని తీసుకుపోయాడు. మొత్తానికి భద్రత పెంచుకున్నాడు. […]
Advertisement
తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్‌కు కొంతకాలంగా గ్రహస్థితి బాగున్నట్లుగా లేదు. ఆయనను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లాడు. తరువాత బెయిల్ పై బయటికి వచ్చాడు. ఆ తరువాత తనకు భద్రత తగ్గిందని ఆందోళన చెందాడు. హైకోర్టును ఆశ్రయించాడు. కొందరు తనను చంపాలని చూస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశాడు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదన్నాడు. ఏపీ సీఎం సాయంతో కేంద్ర హోంమంత్రి దాకా విషయాన్ని తీసుకుపోయాడు. మొత్తానికి భద్రత పెంచుకున్నాడు. ఇంతకీ.. ఆయనను చంపాలని చూసింది ఎవరు? అన్న విషయాన్ని రేవంత్ వెల్లడించలేదు. ఇటీవల గ్యాంగ్ స్టర్ నయీం… టీడీపీ నేత రేవంత్‌ను కూడా చంపాలనుకున్నాడని, ఇందుకోసం రేవంత్ ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే రేవంత్ గతంలో భయపడింది నయీంకేనని, నయీంను అడ్డంపెట్టుకొని తనను చంపి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలనుకున్న నాయకులకేనని అనుకుంటున్నారంతా. ఇప్పుడు నయీం కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఓటుకు నోటు కేసు మూలన పడింది. భద్రతా పరమైన సమస్యలు వీగిపోయాయి అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి రేవంత్ నెత్తిన పిడుగు పడ్డంత పనైంది.
ఓటుకు నోటు కేసులో సరిగా దర్యాప్తు జరగడం లేదని ఆరోపిస్తూ ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి విచారణ జరపాలని ఏసీబీనీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మూలన పడిందనుకుంటున్న కేసు ఇలా అకస్మాత్తుగా తెరపైకి రావడంతో రేవంత్ పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు సాగించిన ఫోన్ సంభాషణ లో ని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరించే ఫోరెన్సిక్ రిపోర్టును కూడా జోడించడంతో రేవంత్, చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. పాపం! రేవంత్.. వరుసగా చుట్టుముడుతున్న ఆపదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడన్నది వాస్తవం.
Advertisement