పెళ్లి కూతురవుతున్న రియో ఒలింపిక్ విజేత...సాక్షి మాలిక్!
రియో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఆమె తన తోటి రెజ్లర్నే వివాహం చేసుకోబోతున్నట్టుగా బెంగాలీ డైలీ ఆనందబజార్ పత్రికకు తెలిపింది. అయితే సాక్షి తన కాబోయే భర్తపేరుని మాత్రం వెల్లడించలేదు. పెళ్లి చేసుకున్నా టోక్యోలో జరగనున్న తరువాత ఒలింపిక్స్ కోసం చేసే కృషిలో ఎలాంటి తేడా ఉండదని సాక్షి తెలిపింది. తన కాబోయే భర్త తనకు ఎంతో అండగా ఉంటాడని, తన కలలను అతని కలలుగా […]
రియో ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఆమె తన తోటి రెజ్లర్నే వివాహం చేసుకోబోతున్నట్టుగా బెంగాలీ డైలీ ఆనందబజార్ పత్రికకు తెలిపింది. అయితే సాక్షి తన కాబోయే భర్తపేరుని మాత్రం వెల్లడించలేదు. పెళ్లి చేసుకున్నా టోక్యోలో జరగనున్న తరువాత ఒలింపిక్స్ కోసం చేసే కృషిలో ఎలాంటి తేడా ఉండదని సాక్షి తెలిపింది. తన కాబోయే భర్త తనకు ఎంతో అండగా ఉంటాడని, తన కలలను అతని కలలుగా భావిస్తాడని సాక్షి మాలిక్ చెప్పింది. పెళ్లి తరువాత తనకో మంచి స్నేహితుడు లభిస్తాడని కూడా ఆమె పేర్కొంది. పెళ్లి తరువాత అతను… తనకు ఒలింపిక్స్కి సిద్ధం కావటంలో సహాయం చేస్తాడని, పెళ్లి తన రెజ్లింగ్ లక్ష్యాలకు ఎలాంటి ఆటంకం కాదని తాను భావిస్తున్నట్టుగా సాక్షి మాలిక్ చెప్పింది.
Click on Image to Read: