తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫడ్నవీస్ ఝలక్!
మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుంది తెలంగాణలో కాంగ్రెస్‌నేతల పరిస్థితి. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ఆందోళనలకు సిద్ధమవుతున్న తరుణంలో జానారెడ్డి గతంలో తాము మహారాష్ట్రతో ఒప్పందమేదీ చేసుకోలేదని చెప్పి కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేశారు. తాజాగా మహారాష్ట్ర సీఎం అలాంటి ఒప్పందం లేనేలేదని, అస్సలు జరగలేదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దీంతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ద్రోహం చేశాడంటూ నెత్తీ నోరు బాదుకుంటున్న కాంగ్రెస్ నేతలకు భారీ […]
Advertisement
మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుంది తెలంగాణలో కాంగ్రెస్‌నేతల పరిస్థితి. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ఆందోళనలకు సిద్ధమవుతున్న తరుణంలో జానారెడ్డి గతంలో తాము మహారాష్ట్రతో ఒప్పందమేదీ చేసుకోలేదని చెప్పి కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేశారు. తాజాగా మహారాష్ట్ర సీఎం అలాంటి ఒప్పందం లేనేలేదని, అస్సలు జరగలేదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దీంతో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ద్రోహం చేశాడంటూ నెత్తీ నోరు బాదుకుంటున్న కాంగ్రెస్ నేతలకు భారీ షాక్ తగిలినట్లయింది. తాముగతంలో చేసిన ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ సీఎంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు మహారాష్ట్ర సీఎం ఇచ్చిన వివరణతో ఇప్పుడు నేలచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు లేదా ఏ ఇతర ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఉమ్మడి ఏపీకి ఎలాంటి అవగాహన ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మహారాష్ట్రలో ఒకలా.. తెలంగాణలో ఒకలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. వారు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ద్వంద ప్రమాణాలు వీడాలని హితవు పలికారు.
మరోవైపు ఈ ఒప్పందంపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ వ్యతిరేకతను తెలియజేశారు. అన్నిపార్టీలను సంప్రదించాకే ఒప్పందం చేసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇక మిత్రపక్షం శివసేన అయితే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తమను సంప్రదించకుండా ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది. మహారాష్ట్ర గవర్నర్ తెలంగాణ వ్యక్తి కాబట్టి, ఆయన ఒత్తిడికి తలొగ్గే సీఎం ఫడ్నవీస్ ఈ ఒప్పందానికి అంగీకరించారని ఆరోపిస్తున్నరు.
Advertisement