స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు ప్రతికూల స్పందన

ఏపీ రాజధానిని సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టేందుకు చంద్రబాబు పకడ్బందీగా పన్నిన స్విస్ చాలెంజ్ పన్నాగం పట్ల హైకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ విధానం ఎవరి కోసం తెచ్చారని ప్రశ్నించింది. విదేశీ కంపెనీల కోసమే ఈ విధానాన్ని ఎంచుకున్నారా? అని ప్రశ్నించింది. ప్రజల కోసం కట్టే రాజధాని విషయంలో దాపరికం ఎందుకని ప్రశ్నించింది. స్విస్‌ చాలెంజ్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ హైకోర్టులో పిల్ వేసింది. దీన్ని విచారించిన ధర్మాసనం … […]

Advertisement
Update:2016-08-23 13:44 IST

ఏపీ రాజధానిని సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టేందుకు చంద్రబాబు పకడ్బందీగా పన్నిన స్విస్ చాలెంజ్ పన్నాగం పట్ల హైకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ విధానం ఎవరి కోసం తెచ్చారని ప్రశ్నించింది. విదేశీ కంపెనీల కోసమే ఈ విధానాన్ని ఎంచుకున్నారా? అని ప్రశ్నించింది. ప్రజల కోసం కట్టే రాజధాని విషయంలో దాపరికం ఎందుకని ప్రశ్నించింది. స్విస్‌ చాలెంజ్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ హైకోర్టులో పిల్ వేసింది. దీన్ని విచారించిన ధర్మాసనం … రాజధాని విషయంలో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడానికి ఇదేమీ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల అంశం కాదన్నారు. ప్రజల ఆస్తులకు ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమేనని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే కుదరదని చెప్పింది.

అసలు స్విస్ చాలెంజ్ కంటే సీల్డ్ కవర్ టెండర్ల విధానమే మేలు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని కోర్టు వెల్లడించింది. అయితే స్విస్ చాలెంజ్ పై హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తుది ఉత్తర్వులు ఎలా వస్తాయో చూడాలి. రాజధాని భూములపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ఆధ్వరంలోని బెంచ్ అంగీకరించలేదు. మరి స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో!.

ఆదిత్య హౌసింగ్ కార్పొరేషన్ తన పిటిషన్‌లో అనేక అంశాలను ప్రస్తావించింది. కేవలం సింగపూర్ కంపెనీలకే ప్రాజెక్టు దక్కేలా అనేక విషయాలను మిగిలిన కంపెనీలకు తెలియకుండా ప్రభుత్వం దాచిపెట్టిందని దీనిపై ప్రశ్నిస్తే అలా గోప్యత పాటించే అధికారం తమకుందని ప్రభుత్వం చెబుతోందని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News