ఆఖ‌రి అస్ర్తంగా జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తా: కేసీఆర్‌

హైకోర్టు విభ‌జ‌న‌పై కేంద్రం నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద సీఎం కేసీఆర్ ధ‌ర్నా చేస్తారంటూ ఇటీవ‌ల వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే! ఆ వార్త‌ల‌ను ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేదు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. హైకోర్టు విభ‌జ‌న స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే.. ఆఖ‌రి అస్ర్తంగా జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాకే ఆ దిశ‌గా ఆలోచిస్తామ‌ని వివ‌రించారు. ఈ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి హామీ ఇచ్చిన సంగ‌తిని గుర్తు […]

Advertisement
Update:2016-08-21 04:47 IST

హైకోర్టు విభ‌జ‌న‌పై కేంద్రం నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద సీఎం కేసీఆర్ ధ‌ర్నా చేస్తారంటూ ఇటీవ‌ల వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే! ఆ వార్త‌ల‌ను ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేదు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. హైకోర్టు విభ‌జ‌న స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే.. ఆఖ‌రి అస్ర్తంగా జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాకే ఆ దిశ‌గా ఆలోచిస్తామ‌ని వివ‌రించారు. ఈ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి హామీ ఇచ్చిన సంగ‌తిని గుర్తు చేస్తున్నారు. అనంత‌రం హైద‌రాబాద్‌లో చీఫ్ జ‌స్టిస్‌ను క‌లిశాన‌ని హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో కొంత‌కాలం వేచి చూడాల‌ని ఆయ‌న సూచించార‌ని అన్నారు. ఆయ‌న మాట మీద మ‌రికొంత‌కాలం వేచి చూస్తామ‌ని మా హైకోర్టు హామీ నెర‌వేర‌కుంటే.. మాత్రం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేసే విష‌యంలో ఎలాంటి మార్పు ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు.

హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో ఏపీనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రం అంటుంది. ఈ విష‌యంలో ఏపీ స‌ర్కారు నోరు మెద‌ప‌డం లేదు. విభ‌జ‌న‌కు స‌హ‌క‌రిస్తామ‌ని, మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీ సీఎం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌తి విష‌యంలోనూ ఏపీ త‌మ‌ను ఇబ్బంది పెడుతోంద‌ని, మ‌రోవైపు ఈ విష‌యంలో కేంద్రం ఏపీ వైపు వేలెత్తి చూపుతోంది. ఏపీ స‌హ‌క‌రించ‌దు- కేంద్రం మా ప‌రిధి కాదు అంటుంది. దీంతో ధ‌ర్నా చేయ‌డం మిన‌హా మాకు వేరు గ‌త్యంత‌రం లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం. కొంత‌కాలంగా తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రంతో స‌న్నిహితంగా ఉన్న‌ తీరు చూస్తోంటే.. హైకోర్టు విభ‌జ‌న విష‌యమై న్యాయం జ‌రుగుతుంద‌ని తెలంగాణ స‌ర్కారు న‌మ్ముతున్న‌ట్లుగా అనిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు. అందుకే, కేసీఆర్ ధ‌ర్నా మాట ప్ర‌స్తావించారని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News