ప్రశాంత్‌ కిషోర్‌తో జగన్‌ డీల్!

తెలుగు గ్లోబల్. కామ్- 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి చంద్రబాబు బలం కన్నా… జగన్ పార్టీ చేతులారా చేసిన పొరపాట్లే ఎక్కువగా ప్రభావం చూపాయన్న భావన బలంగా ఉంది. ఇప్పటికైనా వైసీపీ సరైన వ్యూహాలతో ముందుకెళ్లకుంటే 2019లోనూ చంద్రబాబు వేసే జిమ్మిక్కులను ఎదుర్కొవడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాల నుంచి ఒక విషయం బయటకొస్తోంది. 2014 ఎన్నికల్లో మోదీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకుని దేశాన్ని ఆకట్టుకున్న రాజకీయ ప్రచారకర్త ప్రశాంత్ […]

Advertisement
Update:2016-08-19 03:49 IST

తెలుగు గ్లోబల్. కామ్- 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి చంద్రబాబు బలం కన్నా… జగన్ పార్టీ చేతులారా చేసిన పొరపాట్లే ఎక్కువగా ప్రభావం చూపాయన్న భావన బలంగా ఉంది. ఇప్పటికైనా వైసీపీ సరైన వ్యూహాలతో ముందుకెళ్లకుంటే 2019లోనూ చంద్రబాబు వేసే జిమ్మిక్కులను ఎదుర్కొవడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాల నుంచి ఒక విషయం బయటకొస్తోంది. 2014 ఎన్నికల్లో మోదీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకుని దేశాన్ని ఆకట్టుకున్న రాజకీయ ప్రచారకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు దపాల చర్చలు కూడా జరిగాయంటున్నారు.

2014 ఎన్నికల్లో మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ అనంతరం బీజేపీకి దూరమయ్యారు. ఇటీవల బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కూటమి తరపున ప్రశాంత్‌ ప్రచార బాధ్యతలు భుజానవేసుకుని పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ బృందం పని చేసిన తీరుతో నితీష్‌ కూటమికి అదనంగా చాలా ప్రయోజనమే కలిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేని రీతిలో నితీష్ కూటమి గెలుపొందింది. దీంతో ఇప్పుడు జగన్ కూడా ఆయన సాయం తీసుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ టీం ఎలా పనిచేస్తుంది?

కిషోర్ టీమ్‌లో జర్నలిస్టులు, లాయర్లు, మనీ మేనేజర్లు, డిజిటల్ మీడియా స్పెషలిస్ట్‌లు, ఐటీ నిపుణులు ఉంటారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు, ప్రతి విమర్శలు చేసేందుకు అవసరమైన సమాచార సేకరణలో జర్నలిస్టులు సహకరిస్తారు. న్యాయపరమైన అంశాలు, సమస్యల విషయంలో లాయర్లు సహకరిస్తారు. మనీ మేనేజర్లు డబ్బు వ్యవహారాలను చూసుకునేందుకు ఉపయోగపడతారు. సోషల్ మీడియాలో ప్రచారానికి డిజిటల్ మీడియా స్సెషలిస్టులు ఉపయోగపడతారు. సమాచారాన్ని, సందేశాలను ఎప్పటికప్పుడు ఎవరికి ఎలా పంపాలి అన్నది ఈ టీం చూసుకుంటుంది.

నియోజక వర్గానికి పదివేల మంది మొబైల్ ఫోన్ యూజర్లను ఎంపిక చేస్తారు. వారి నెంబర్లను వివిధ వాట్సప్ గ్రూపులు, ట్విట్టర్, ఫేస్‌బుక్ యూజర్లతో అనుసంధిస్తారు. తాము పంపిన సందేశాన్ని ఈ పది వేల మంది యూజర్ల ద్వారా వివిధ గ్రూపుల్లోని వ్యక్తులకు చేరేలా చేస్తారు. కిల్లీ కొట్లు, టీ కొట్టు వద్ద ఎక్కువగా ఉండేవారిపై ప్రత్యేక దృష్టి పెడుతారు. వారికి పార్టీకి సంబంధించిన సమాచారం చేరవేస్తూ ఉంటారు. . ప్రత్యర్థి పార్టీ చేసే విమర్శలకు గంటలోగా సమాధానాలు ఇస్తారు. బీహార్‌ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ టీవీల్లో నితీష్ కుమార్ యాడ్స్ వస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే గంటలోపే ఓ పాకిస్తాన్ టీవీల్లో వస్తున్న బీజేపీ యాడ్‌ను రికార్డు చేసి సోషల్ నెట్ వర్క్‌లో పెట్టింది ప్రశాంత్ కిషోర్ టీం. దీంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. ప్రశాంత్ టీం ఈ విధంగా పనిచేస్తుంటుంది. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్‌తో జగన్ డీల్ ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

ఒకవేళ ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదిరినా జగన్ ఆయనను స్వతంత్రంగా పనిచేసుకోనిస్తారా? లేక ప్రతి విభాగానికి నాయకత్వం వహించాలని ఉవ్వెళ్ళూరే వారినేత్రుత్వంలోనే పనిచేయమని ప్రశాంత్ కిషోర్ ని కూడా కోరుతాడా? చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News