కోమటిరెడ్డితో సెటిల్‌మెంట్ చేయలేదు " ఉమా మాధవరెడ్డి

రాజకీయంగా తమను దెబ్బతీసేందుకే నయీంతో తమకు సంబంధాలున్నాయంటూ ప్రభుత్వం లీకులిస్తోందని ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. ఒక ఛానల్‌తో మాట్లాడిన ఆమె… భువనగిరికి ఉప ఎన్నిక కోసం తాను ఎదురుచూడలేదన్నారు. భువనగిరి ఎమ్మెల్యేను చంపేందుకు నయీం గ్యాంగ్ ప్రయత్నించిందని వార్తలొస్తున్న నేపథ్యంలో… ఒక వేళ అలా జరిగినా తాను ఉప ఎన్నికలో పోటీ చేసేవ్యక్తిని కాదన్నారు. అసాంఘిక శక్తుల చేతిలో ఒకరు చనిపోతే ఆ స్థానంలో పోటీగా బరిలో దిగే వ్యక్తిత్వం తనది కాదన్నారామె. రాజకీయ నాయకుల అండ […]

Advertisement
Update:2016-08-16 16:07 IST

రాజకీయంగా తమను దెబ్బతీసేందుకే నయీంతో తమకు సంబంధాలున్నాయంటూ ప్రభుత్వం లీకులిస్తోందని ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. ఒక ఛానల్‌తో మాట్లాడిన ఆమె… భువనగిరికి ఉప ఎన్నిక కోసం తాను ఎదురుచూడలేదన్నారు. భువనగిరి ఎమ్మెల్యేను చంపేందుకు నయీం గ్యాంగ్ ప్రయత్నించిందని వార్తలొస్తున్న నేపథ్యంలో… ఒక వేళ అలా జరిగినా తాను ఉప ఎన్నికలో పోటీ చేసేవ్యక్తిని కాదన్నారు. అసాంఘిక శక్తుల చేతిలో ఒకరు చనిపోతే ఆ స్థానంలో పోటీగా బరిలో దిగే వ్యక్తిత్వం తనది కాదన్నారామె. రాజకీయ నాయకుల అండ లేకుంటే నయీం ఈ స్థాయికి ఎదిగే అవకాశం లేదన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నయీం మధ్య రూ. 5కోట్లకు తాను సెటిల్‌మెంట్‌ చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారామె. నయీం, రాజగోపాల్‌ రెడ్డి మధ్య సెటిల్‌మెంట్ చేయాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో చేర్చుకోవాలంటే మర్యాదగా చేర్చుకోవాలి గానీ.. ఇలా బెదిరిస్తే లొంగే ప్రసక్తే లేదన్నారు. నిజంగా నయీంతో తనకు సంబంధాలుంటే తన ఇంటికే వచ్చి అరెస్ట్ చేయాలి గానీ… ఇలా లీకులివ్వడం ఏమిటని ప్రశ్నించారు.

నయీం మాధవరెడ్డి హయాంలో లొంగిపోయిన మాటవాస్తవమేనని… అందులోనూ భువనగిరికే చెందిన వ్యక్తి కావడంతో నయీంతో తమ కుటుంబానికి లింకులు పెడుతున్నారని ఉమా మాధవరెడ్డి ఆరోపించారు. అవసరమైతే రాజకీయాల నుంచే తప్పుకుంటాం గానీ.. చిల్లర పనులు చేయడం తమ కుటుంబంలోనే లేదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News