సింహంతో సెల్ఫీ ఖరీదు...రవీంద్ర జడేజాకు 20వేల జరిమానా!
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కులో…వెనుక సింహాలు కనిపించేలా సెల్ఫీలు దిగి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జునాగథ్ అటవీశాఖ అధికారులు ఆయనకు 20వేల రూపాయల జరిమానా విధించారు. జూన్ 14న జడేజా ఫొటోలు తీసుకోగా …దీనిపై ఇంకా తుది విచారణ నివేదిక రాకముందే అధికారులు ఆయనకు జరిమానా విధించారు. జడేజా తరపున ఆయన మామ హర్వేద్ సింగ్ సోలంకి పవర్ ఆప్ అటార్నీతో హాజరై…జరిమానా చెల్లించారు. రవీంద్ర జడేజా…పవర్ ఆఫ్ […]
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్కులో…వెనుక సింహాలు కనిపించేలా సెల్ఫీలు దిగి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జునాగథ్ అటవీశాఖ అధికారులు ఆయనకు 20వేల రూపాయల జరిమానా విధించారు. జూన్ 14న జడేజా ఫొటోలు తీసుకోగా …దీనిపై ఇంకా తుది విచారణ నివేదిక రాకముందే అధికారులు ఆయనకు జరిమానా విధించారు. జడేజా తరపున ఆయన మామ హర్వేద్ సింగ్ సోలంకి పవర్ ఆప్ అటార్నీతో హాజరై…జరిమానా చెల్లించారు. రవీంద్ర జడేజా…పవర్ ఆఫ్ అటార్నీలో తాను హాజరయ్యే స్థితిలో లేనని తెలిపాడు. దాంతో నేరుగా జడేజా నుండి వివరణ తీసుకోకుండానే అధికారులు ఆయనకు జరిమానా విధించారు.
జులై 14న జడేజా… భార్య రివా, మరికొంత మంది స్నేహితులతో కలిసి… గిర్ నేషనల్ పార్కులో లయన్ సఫారీలో వెనుక సింహాలు కనిపించేలా ఫొటోలు దిగాడు. వీరితో పాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు సైతం ఉన్నారు. అభయారణ్యమైన ఆ ప్రాంతంలో ఫొటోలు దిగటం అటవీశాఖ నిబంధనల ప్రకారం నేరం. దాంతో ఈ విషయంపై విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు జడేజాని జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అయితే అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ తాలూకూ తుది నివేదికను పరిశీలించకుండానే… కిందిస్థాయి అధికారులు ఈ జరిమానా విధించినట్టుగా తెలుస్తోంది.
Click on Image to Read: