ఏపీ విచ్చలవిడితనానికి కేంద్రం అభ్యంతరం
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 30 వేల ఎకరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం మరో 40వేల ఎకరాల అటవీ భూమిని తీసుకునేందుకు సిద్ధపడడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో అటవీ భూములను ప్రస్తుత తరుణంలో తీసుకునేందుకు అభ్యంతరం చెప్పింది. అటవీ భూమిని ఢీనోటిఫై చేస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు?. ఆ భూమిలో ఏ ఏ ప్రాజెక్టులను నెలకొల్పుతారో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ ఆదేశించింది. అప్పటి వరకు అటవీ భూములను […]
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 30 వేల ఎకరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం మరో 40వేల ఎకరాల అటవీ భూమిని తీసుకునేందుకు సిద్ధపడడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో అటవీ భూములను ప్రస్తుత తరుణంలో తీసుకునేందుకు అభ్యంతరం చెప్పింది. అటవీ భూమిని ఢీనోటిఫై చేస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు?. ఆ భూమిలో ఏ ఏ ప్రాజెక్టులను నెలకొల్పుతారో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ ఆదేశించింది. అప్పటి వరకు అటవీ భూములను ఢీనోటిఫై చేయడం కుదరదని తేల్చిచెప్పింది.
రాజధాని ప్రణాళిక ఇంకా పూర్తి కానందున … అటవీ భూముల వినియోగంపై తర్వాత నివేదిక ఇస్తామని ప్రస్తుతానికి భూములు ఢీనోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినా కేంద్రం అంగీకరించలేదు. అయితే అటవీ భూములు ఇవ్వకుండా అడ్డుకోవడం వెనుక రాజకీయ కారణమే ఉందని ఏపీ అధికారుల వాదన. ప్రాథమిక అనుమతులు ఇది వరకే ఇచ్చాయని రెండో దశలో అటవీ భూముల వినియోగ ప్రణాళికను అందజేయాల్సిన అవసరం లేదని ఏపీ అధికారులు చెబుతున్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే అటవీ భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటికే 30 వేల ఎకరాల పంట భూములను తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం వాటిని తనకు అనుకూలమైన వ్యక్తులకు పరిశ్రమల పేరుతో వందల ఎకరాలు, సింగపూర్ కంపెనీకి దాదాపు రెండు వేల ఎకరాలు కట్టబెట్టేందుకు సిద్ధమవడం వంటి విచ్చలవిడి తనాన్ని కేంద్రం గమనించిన తర్వాతే అటవీ భూముల ఢీనోటిఫైకి సుముఖంగా లేదని చెబుతున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఇచ్చే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో భూములు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే ఇందుకు కడప జిల్లా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య ఒక అడుగు ముందుకేసి కడప జిల్లా భూముల జోలికి వస్తే రక్తపాతం జరుగుతుందని ఇటీవల హెచ్చరించారు. మొత్తం మీద చంద్రబాబు తీరుపై కేంద్రం అనుమానాస్పదంగానే ఉందన్న వాదనకు అటవీ భూముల అంశం బలాన్ని చేకూరుస్తోంది.
Click on Image to Read:
తమన్నా దృష్టి ఎప్పుడు దాని పైనే..!
సన్నీలియోన్ మనస్సు దోచుకున్న బాహుబలి
సెక్స్ అడిక్ట్‌గా అవసరాల శ్రీనివాస్…