వంతెన కూలింది...పది పైగా వాహనాలు కొట్టుకుపోయాయి!
మహారాష్ట్రలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఘోర ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. మహద్ అనే పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ముంబయి గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై వెళుతున్న రెండు బస్సులు కొట్టుకుపోయాయి. పదిపైగా ఇతర వాహనాలు ఆ సమయంలో బ్రిడ్జిపై నుండి వెళుతూ కొట్టుకుపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. రెండు బస్సుల్లో 22 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కూలిపోయిన బ్రిడ్జి బ్రిటీష్ కాలం నాటిది. మూడు బృందాల నేషనల్ డిజాస్టర్ […]
మహారాష్ట్రలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఘోర ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. మహద్ అనే పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ముంబయి గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై వెళుతున్న రెండు బస్సులు కొట్టుకుపోయాయి. పదిపైగా ఇతర వాహనాలు ఆ సమయంలో బ్రిడ్జిపై నుండి వెళుతూ కొట్టుకుపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. రెండు బస్సుల్లో 22 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కూలిపోయిన బ్రిడ్జి బ్రిటీష్ కాలం నాటిది.
మూడు బృందాల నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 80మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జోరున కురుస్తున్న వాన సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. తీర రక్షక దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్‌ని సహాయక చర్యలకోసం వినియోగిస్తున్నారు. ఇంతవరకు వాహనాలు కానీ, వ్యక్తులు కానీ బయటపడినట్టుగా సమాచారం లేదు. కూలిపోయిన వంతెన పక్కనే మరొక కొత్త వంతెన ఉంది. ప్రమాదం అనంతరం అధికారులు ఆ వంతెనపై నుండి ట్రాఫిక్‌ని మళ్లిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోడి ఫడ్నవిస్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుండి అవసరమైన సహాయం తీసుకోవాల్సిందిగా చెప్పారు. మృతుల సంఖ్యని అప్పుడే ప్రకటించే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పేర్కొన్నారు.