వెంకయ్య కోసం బలమైన జాకీ...

తెలుగుగ్లోబల్. కామ్-  స్టేట్ లో చంద్రబాబును, ఢిల్లీలో వెంకయ్యనాయుడును మోస్ట్ పవర్ ఫుల్ పర్సనాలిటీస్ అని చూపేందుకు టీడీపీ అనుకూల పత్రికలు చేసే విన్యాసాలు అన్నీఇన్నీ కాదు. వ్యవస్థ మొత్తం తగలబడిపోతున్నా, అందుకు బాధ్యులైనప్పటికీ వెంకయ్య, చంద్రబాబు సేఫ్‌గా ఉండాలన్నది పచ్చమీడియా పాకులాట. ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట్రం రగిలిపోతున్న వేళ ఆ రెండు పత్రికల్లో ఒక పత్రిక మంగళవారం కొత్త విన్యాసం ప్రదర్శించింది. ఢిల్లీలో ఉన్న వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తుండే సరికి… […]

Advertisement
Update:2016-08-02 00:42 IST

తెలుగుగ్లోబల్. కామ్- స్టేట్ లో చంద్రబాబును, ఢిల్లీలో వెంకయ్యనాయుడును మోస్ట్ పవర్ ఫుల్ పర్సనాలిటీస్ అని చూపేందుకు టీడీపీ అనుకూల పత్రికలు చేసే విన్యాసాలు అన్నీఇన్నీ కాదు. వ్యవస్థ మొత్తం తగలబడిపోతున్నా, అందుకు బాధ్యులైనప్పటికీ వెంకయ్య, చంద్రబాబు సేఫ్‌గా ఉండాలన్నది పచ్చమీడియా పాకులాట. ప్రత్యేకహోదా కేంద్రం ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట్రం రగిలిపోతున్న వేళ ఆ రెండు పత్రికల్లో ఒక పత్రిక మంగళవారం కొత్త విన్యాసం ప్రదర్శించింది. ఢిల్లీలో ఉన్న వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తుండే సరికి… వెంకయ్యను వెనుకేసుకొచ్చేందుకు సదరు పత్రిక పొట్లం కట్టి ఒక కథనాన్ని జనంలోకి వదిలింది. అదేటంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన అరుణ్‌ జైట్లీని వెంకయ్య కలిసి వాదులాటకు దిగారట. ఏపీకి ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వారని నిలదీశారట. దాంతో అరుణ్ జైట్లీ 14వ ఆర్థిక సంఘం కారణంగా హోదా ఇవ్వలేకపోతున్నామని వెంకయ్యకు వివరణ ఇచ్చుకున్నారట. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘానికి సంబంధం ఏమిటని వెంకయ్య తిరిగి ఎదురుప్రశ్నించారని టీడీపీ పత్రిక కథనం. అయితే ఇక్కడ బాబు మీడియా మరిచిన సంగతి ఏమిటంటే…

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని అందరి కంటే ముందు చెప్పిన వ్యక్తి అరుణ్ జైట్లీ కాదు… వెంకయ్యనాయుడే. ఎన్నికల్లో సమర్థవంతంగా జనాన్ని మోసం చేసి ఓట్లేయించుకున్న ఏడాదికే విజయవాడ వేదికగానే హోదా సాధ్యం కాదని తేల్చిన వ్యక్తి వెంకయ్య. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పక్కనున్న తమిళనాడు, కేరళ, కర్నాటక లాంటి రాష్ట్రాలు అభ్యంతరం చెబుతాయని తొలుత సెలవిచ్చిందే వెంకయ్యనాయుడు. ఏపీకి హోదా ఇస్తే దేశంలో అనేక రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వస్తుందని ఆ సమయంలోనే వెంకయ్య వివరించారు. ఇలా హోదా సాధ్యం కాదని ఏడాది క్రితమే చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు అరుణ్ జైట్లీతో హోదా కోసం వాదులాట పెట్టుకున్నారట!, దాన్ని జనం నమ్మాలట!. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మరీ ఇంత వెర్రివాళ్లలా ఈ మేధావులకు ఎలా కనిపిస్తున్నారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News