బాబుకు ఏడాది క్రితమే సలహా ఇచ్చా... ఇది ఎక్కువ రోజులు ఉండదు- జేసీ
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-బీజేపీ మధ్య బంధం ఇక ఎక్కువ రోజులు నిలవదన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సిందిగా ఏడాది క్రితమే తాను చంద్రబాబుకు సలహా ఇచ్చానన్నారు. ఇప్పటికైనా వచ్చే మార్చిలోగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే టీడీపీకి మంచిదన్నారు. ఇది సాగే సంసారం కాదని, ఇక విడాకులు ఎప్పుడు తీసుకోవాలన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబును మోదీ ప్రధాన శత్రువుగా భావిస్తున్నారని దివాకర్ రెడ్డి చెప్పారు. దేశ రాజకీయాల్లో చక్రం […]
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-బీజేపీ మధ్య బంధం ఇక ఎక్కువ రోజులు నిలవదన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సిందిగా ఏడాది క్రితమే తాను చంద్రబాబుకు సలహా ఇచ్చానన్నారు. ఇప్పటికైనా వచ్చే మార్చిలోగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే టీడీపీకి మంచిదన్నారు. ఇది సాగే సంసారం కాదని, ఇక విడాకులు ఎప్పుడు తీసుకోవాలన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలన్నారు.
చంద్రబాబును మోదీ ప్రధాన శత్రువుగా భావిస్తున్నారని దివాకర్ రెడ్డి చెప్పారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తి చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లకు మాత్రమే ఉందన్నారు. అందుకే చంద్రబాబును చూసి మోదీ భయపడుతున్నారని నిప్పు రాజేశారు జేసీ. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే మోదీకి రూల్స్ అడ్డంకి కావన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇచ్చేఆలోచన కేంద్రానికి లేదన్నారు. అందుకే రూల్స్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని జేసీ వ్యాఖ్యానించారు.
Click on Image to Read: