వైసీపీ స్వింగ్‌ చూసి వెనక్కు తగ్గిన మాట నిజమే...

తమ వారసులను మొన్నటి ఎన్నికల్లో బరిలో దింపకపోవడానికి ప్రత్యేక పరిస్థితులే కారణమని తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ స్వింగ్‌లో ఉండడం చూసి ఆ సమయంలో వారసులను దింపడం సరికాదనిపించిందన్నారు. అందుకే తాడిపత్రి నుంచి తాను పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో జగన్ తమ వద్దకు రాలేదని… తాము జగన్ వద్దకు వెళ్లలేదని చెప్పారు. చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి పిలిస్తే టీడీపీలో చేరామన్నారు. తమకు తాముగా టీడీపీలో చేరలేదన్నారు. తాము ఈ స్థాయిలో […]

Advertisement
Update:2016-07-29 09:55 IST

తమ వారసులను మొన్నటి ఎన్నికల్లో బరిలో దింపకపోవడానికి ప్రత్యేక పరిస్థితులే కారణమని తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పారు. వైసీపీ స్వింగ్‌లో ఉండడం చూసి ఆ సమయంలో వారసులను దింపడం సరికాదనిపించిందన్నారు. అందుకే తాడిపత్రి నుంచి తాను పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో జగన్ తమ వద్దకు రాలేదని… తాము జగన్ వద్దకు వెళ్లలేదని చెప్పారు. చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి పిలిస్తే టీడీపీలో చేరామన్నారు. తమకు తాముగా టీడీపీలో చేరలేదన్నారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కాంగ్రెసే కారణమని చెప్పారు. చివరిలో నియోజకవర్గంలోని రెడ్లంతా తమకు హ్యాండిచ్చి వైసీపీ వైపు నిలబడ్డారని అందుకే 40వేలు వస్తుందనుకున్న మెజారిటీ 25 వేలకు తగ్గిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కుమార్ రెడ్డిని బరిలో దింపితే తప్పేంటని ప్రశ్నించారు. పవన్‌ కుమార్‌ రెడ్డి విదేశాల్లో ఎంబీఏ చదివాడని… సల్మాన్ ఖాన్ నుంచి సచిన్ వరకు తమవాడికి పరిచయాలున్నాయన్నారు. చురకైన వాడని చెప్పారు. జగన్, పవన్ క్లాస్‌మేట్లని ఇద్దరూ బాగానే ఉంటారని చెప్పారు. పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారా అని ప్రశ్నించగా భవిష్యత్తు గురించి తనకు తెలియదన్నారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో కనిపిస్తే అన్న ఎలా ఉన్నావు అంటూ జగన్ పలకరిస్తాడని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. శుభకార్యాలుంటే వారి ఇంటికి తాము, తమ ఇంటికి వారు వస్తుంటారని చెప్పారు. పరిటాల రవిని చంపించాల్సిన అవసరం అటు వైఎస్ కుగానీ, ఇటు తమకు గానీ లేదన్నారు. కేవలం అప్పటి తెలుగుదేశం నాయకత్వం హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకే తన అన్న జేసీ దివాకర్ రెడ్డిపైనా ఫిర్యాదు చేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News