ఫిరాయింపుల్లో పచ్చ"ఖాకీ"...
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కొందరు పోలీస్ అధికారులు బరి తెగించేస్తుంటారు. ఖాకీ చొక్కాకు పచ్చరంగు వేసుకోవడం మినహా టీడీపీకి అనుకూలంగా అన్ని పనులుచేస్తుంటారు. తాజాగా తిరుపతి ఏఎస్పీ సిద్ధారెడ్డి టీడీపీ కార్యకర్తల కంటే చురుగ్గా పనిచేస్తున్నారు. ఆదివారం కడప జిల్లా సుండెపల్లి మండలం తిమ్మసముద్రంలో పార్టీ ఫిరాయింపు కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున సమక్షంలో నిర్వహించారు. తిమ్మసముద్రం సర్పంచ్ శాంతమ్మతో పాటు మరికొందరు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సిద్ధారెడ్డి కూడా […]
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కొందరు పోలీస్ అధికారులు బరి తెగించేస్తుంటారు. ఖాకీ చొక్కాకు పచ్చరంగు వేసుకోవడం మినహా టీడీపీకి అనుకూలంగా అన్ని పనులుచేస్తుంటారు. తాజాగా తిరుపతి ఏఎస్పీ సిద్ధారెడ్డి టీడీపీ కార్యకర్తల కంటే చురుగ్గా పనిచేస్తున్నారు. ఆదివారం కడప జిల్లా సుండెపల్లి మండలం తిమ్మసముద్రంలో పార్టీ ఫిరాయింపు కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున సమక్షంలో నిర్వహించారు. తిమ్మసముద్రం సర్పంచ్ శాంతమ్మతో పాటు మరికొందరు టీడీపీలో చేరారు.
ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సిద్ధారెడ్డి కూడా హాజరయ్యారు. సరే ఏదో ఆ సమయంలో అక్కడికి వచ్చారేమోలే అనుకునేందుకు లేదు. సర్పంచ్, మరికొందరి ఫిరాయింపుకు కర్తాకర్మ క్రియ ఏఎస్పీ సిద్ధారెడ్డే. ఇటీవల టీడీపీ నేతల సాయంతో సిద్ధారెడ్డి తిరుపతి ఏఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి సిద్ధారెడ్డి టీడీపీపై మరింత ప్రేమ పెంచుకున్నారు. టీడీపీ రుణం తీర్చుకోవడంలో భాగంగా బంధువైన తిమ్మసముద్రం సర్పంచ్, అదే గ్రామానికి చెందిన మరికొందరిని టీడీపీలోకి ఫిరాయింప చేశారు. అది కూడా చట్టవిరుద్ధమైన ఫిరాయింపు కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. ఇది చూసి నిజాయితీగా పనిచేసే పోలీసులు బాధపడుతున్నారు. కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి వియంకుడి కనుసన్నల్లో మైదుకూరులో పాలన సాగుతోంది. ఆయన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కింది నుంచి పైవరకు అందరూ ఒకే సామాజికవర్గం వారిని అధికారులుగా నియమించుకున్నారు. సదరు నేత తనయుడు ఇటీవల ఒక కార్యక్రమం నిర్వహించగా పోలీసులంతా వెళ్లారు. ప్రజలు చూస్తుండగానే ఎలాంటి పదవిలో లేని టీడీపీ నేత తనయుడికి యూనిఫాంలోనే సెల్యూట్ చేసి ప్రజల్లో అభాసుపాలైనట్టు సమాచారం. ఈ పరిస్థితి చూసి చివరకు టీడీపీ సీనియర్లు కూడా సిగ్గుపడుతున్నారు. వ్యవస్థలు మరీ ఇంత దిగజారిపోవడం మంచి పరిణామం కాదంటున్నారు.
Click on Image to Read: