ఎప్పుడొస్తానో నాకే తెలియదు..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రాజెక్టుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రుల నుంచి వార్డుమెంబర్ల దాకా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే! తాజాగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు కేసీఆర్. ప్రాజెక్టు కోసం సర్కారు వద్ద రూ.1500 కోట్ల నిధులున్నాయి.. పనుల్లో నాణ్యత కొరవడకూడదు అని ఆదేశించారు. 46 కోట్ల మొక్కలను నాటాలని, ఆ మొక్కల ఎదుగుదలే మీ పనితీరుకు […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రాజెక్టుపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రుల నుంచి వార్డుమెంబర్ల దాకా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే! తాజాగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించారు కేసీఆర్. ప్రాజెక్టు కోసం సర్కారు వద్ద రూ.1500 కోట్ల నిధులున్నాయి.. పనుల్లో నాణ్యత కొరవడకూడదు అని ఆదేశించారు. 46 కోట్ల మొక్కలను నాటాలని, ఆ మొక్కల ఎదుగుదలే మీ పనితీరుకు నిదర్శనంగా తాను భావిస్తానని ప్రజాప్రతినిధులు, అధికారులను హెచ్చరించారు. అయితే, తన ఆదేశాలను అందరూ పాటిస్తారా? అన్న అనుమానం ఆయనకు కూడా కలిగింది. అందుకే, సోమవారం నుంచి తెలంగాణలో జరుగుతున్న హరితహారం పనులను ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఎప్పుడు, ఎక్కడికి వస్తానో నాకే తెలియదు.. పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు.
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటగానే సరిపోదని, వాటి పరిరక్షణ బాధ్యత కూడా మీదేనని అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి, గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. నాటిమొక్కల్లో 90 శాతం కాపాడుకోవాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది. మొక్కల పరిరక్షణ ఏ ప్రాంతంలో ఎలా ఉంది? అన్న విషయంపై కేసీఆర్‌కు నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటాయి. దీంతో అధికారులు వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హరితహారం ప్రారంభం రోజున నాటిన మొక్కల పరిరక్షణలో విఫలమయ్యారని నిజామాబాద్‌లో ఆరుగురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే! మొక్కల రక్షణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్న సంకేతాలు అధికారుల్లోకి బలంగా చేరాలంటే.. ఆకస్మిక తనిఖీలు జరగాల్సిందేని కేసీఆర్ నిర్ణయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ప్రజాప్రతినిధులు, అధికారులు జవాబుదారీగా ఉంటారన్నది ఆయన ఆలోచన.
Advertisement