ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పోస్తే... జ‌రిమానే?

మీకు రోడ్ల‌పై బ‌హిరంగంగా మూత్ర విస‌ర్జ‌న చేసే అల‌వాటుందా? అయితే, దాన్ని వెంట‌నే మానేయండి. ఇక‌పై ఇలా చేస్తే.. హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ వాళ్లు జ‌రిమానా విధించ‌నున్నారు. న‌గ‌ర‌ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేనా, గోడ‌ల‌పై రాత‌లు, పోస్టర్లు ఇష్టానుసారంగా అంటించ‌రాద‌ని, చెత్త‌వేయ‌కుండా.. చర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కోసం ఈ నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు మేయ‌ర్‌. న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచాల‌న్న‌ ఆలోచ‌న‌ బాగానే ఉంది కానీ.. బ‌హిరంగ మూత్ర […]

Advertisement
Update:2016-07-17 04:37 IST
మీకు రోడ్ల‌పై బ‌హిరంగంగా మూత్ర విస‌ర్జ‌న చేసే అల‌వాటుందా? అయితే, దాన్ని వెంట‌నే మానేయండి. ఇక‌పై ఇలా చేస్తే.. హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ వాళ్లు జ‌రిమానా విధించ‌నున్నారు. న‌గ‌ర‌ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేనా, గోడ‌ల‌పై రాత‌లు, పోస్టర్లు ఇష్టానుసారంగా అంటించ‌రాద‌ని, చెత్త‌వేయ‌కుండా.. చర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కోసం ఈ నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు మేయ‌ర్‌. న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచాల‌న్న‌ ఆలోచ‌న‌ బాగానే ఉంది కానీ.. బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌న చేసిన‌వారికి జ‌రిమానా వేసే ముందు.. మేయ‌ర్‌గారు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.
అవేంటంటే..?
గ్రేట‌ర్ హైద‌రాబాద్ జ‌నాభా కోటిపైమాటే! ఇక్క‌డున్న జ‌నాభా కాకుండా.. ప్ర‌తిరోజు వేలాదిమంది వివిధ ప‌నుల‌పై న‌గ‌రానికి వ‌స్తుంటారు. ఇక న‌గ‌రంలో ఈ మూల నుంచి ఆమూల‌కు ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది. హైద‌రాబాద్‌లో మ‌ధుమేహం (షుగ‌ర్‌) పేషెంట్ల కూడా ల‌క్ష‌ల్లోనే ఉంది. వీరంద‌రూ ప్ర‌తిరోజూ గంట‌ల‌కొద్ది ప్ర‌యాణాలు చేయాల్సి ఉంటుంది. న‌గ‌రంలో మ‌ల‌మూత్ర స‌దుపాయాలు ఉన్న ప్రాంతాలు చాలా స్వ‌ల్పం. కొన్ని ప్రాంతాల్లోనైతే ఎన్ని కిలోమీట‌ర్లు ప్ర‌యాణించినా.. ఒక్క మ‌రుగుదొడ్డి కూడా క‌నిపించ‌దు. మ‌గ‌వాళ్ల ప‌రిస్థితే ఇంత ద‌య‌నీయంగా ఉంటే.. ఇక మ‌హిళలు ప‌డే అవ‌స్థ‌లను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. న‌గ‌ర జనాభా కోటిదాటినా.. ఇక్క‌డ ఉన్న‌ సుల‌భ్ కాంప్లెక్స్‌ల సంఖ్య మాత్రం వంద‌ల్లోనే. కొన్నిచోట్ల మొబైల్ టాయిటెట్లు ఏర్పాటుచేసినా.. వాటి నిర్వ‌హ‌ణ స‌రిగాలేదు. చాలావాటికి తాళాలే వేసి ఉంటాయి.
ఉన్న‌ప‌లంగా జ‌రిమానా అంటే.. న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. న‌గ‌రంలోని ర‌ద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బ‌స్టాండ్లలో ముందుగా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. త‌రువాత మురికివాడల్లోని ప్ర‌జ‌ల‌కు, వాహ‌న‌దారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి. ప్ర‌జ‌లంద‌రికీ త‌గిన ప్ర‌చారం క‌ల్పించాలి. అప్పుడు జ‌రిమానా ఆలోచ‌న చేస్తే.. బాగుంటుంద‌ని ప‌లువురు న‌గ‌ర‌పౌరులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News