చెవిరెడ్డిని వైసీపీ వదిలేసిందా?

వైసీపీ వ్యూహాలు ఒక్కోసారి విచిత్రంగానే ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆ పార్టీ ఎప్పుడు ఎలా స్పందింస్తుందో చెప్పడం కాస్త కష్టమే. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విషయం ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగానే ఉంది. ఒక ఎమ్మెల్యేని, అది కూడా జగన్‌ కోసం రొమ్ముచించుకుని నిలబడే ఒక ఎమ్మెల్యేను చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టినట్టు వెంటాడుతుంటే వైసీపీ నుంచి ఎక్కడా స్పందన లేదు. కేవలం ఎంపీ మిథున్ రెడ్డి లాంటి ఒకరిద్దరు రియాక్ట్ అవడం […]

Advertisement
Update:2016-07-10 15:17 IST

వైసీపీ వ్యూహాలు ఒక్కోసారి విచిత్రంగానే ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆ పార్టీ ఎప్పుడు ఎలా స్పందింస్తుందో చెప్పడం కాస్త కష్టమే. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విషయం ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగానే ఉంది. ఒక ఎమ్మెల్యేని, అది కూడా జగన్‌ కోసం రొమ్ముచించుకుని నిలబడే ఒక ఎమ్మెల్యేను చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టినట్టు వెంటాడుతుంటే వైసీపీ నుంచి ఎక్కడా స్పందన లేదు. కేవలం ఎంపీ మిథున్ రెడ్డి లాంటి ఒకరిద్దరు రియాక్ట్ అవడం మినహాయిస్తే పార్టీ అగ్రనాయకత్వం నుంచి స్పందన లేదు.

ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ నుంచి కూడా అనుమతి ఉండాలని చెబుతుంటారు. కానీ చెవిరెడ్డిని చిత్తూరు జిల్లాలోని వివిధ స్టేషన్ల పోలీసులు ఫుట్‌బాల్‌గా ఆడుకుంటుంటే వైసీపీ మాత్రం చాలా లైట్ తీసుకున్నట్టుగా ఉంది. బెయిల్‌పై జైలు నుంచి బయటకు రావడం అప్పటికే అక్కడ మరో కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు మాటు వేయడం ఇదంతా ఒక సినిమాను తలపిస్తోంది. ఇంకా చెప్పాలంటే చెవిరెడ్డితో టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కామెడీ గేమ్ ఆడుకుంటున్నారు. చివరకు ఇది భరించలేక ఇలా వేధించడం కంటే ఒకేసారి కాల్చిపారేయండి అని చెవిరెడ్డే ఆవేదన చెందే స్థాయికి పరిస్థితి వెళ్లింది. కానీ చెవిరెడ్డికి అండగా, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైసీపీ ఎక్కడా కూడా నిర్మాణాత్మకంగా పైట్ చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

రెండు రోజుల్లో మూడు సార్లు అది కూడా చిన్నచిన్నకేసుల్లో అరెస్ట్ చేసి వేధిస్తుంటే ఆ పార్టీ నాయకత్వం ఏం చేస్తోందో?. బహుశా చెవిరెడ్డికి అరెస్ట్ కావడం ఇదేం కొత్తకాదు కదా.. లైట్‌ తీసుకుంటే పోలా అన్న అభిప్రాయానికి వైసీపీ నాయకత్వమే వచ్చింది కాబోలు. ఒక ఎమ్మెల్యేను ఇలా వెంటాడి వరుస పెట్టి అవమానకరంగా అరెస్ట్‌లు చేస్తుంటే మరో పార్టీ అయితే ఈపాటికి రచ్చరచ్చ చేసేది. చంద్రబాబు అయి ఉంటే జైలు ముందే ధర్నా చేసి… రాష్ట్రపతిని కలిసేందుకు కూడా ప్లాన్ చేసుకునే వారు. ఒకవేళ తమ గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు పన్నిన వ్యూహంలో భాగమే చెవిరెడ్డి వరుస అరెస్ట్‌లు అని వైసీపీ అనుకుంటుందో ఏమో!.

click on image to read-

 

 

Tags:    
Advertisement

Similar News