జనవరిలో కొత్త సీఎం గా కేటీఆర్?
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితిని, సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిసేపు కలకలానికి కారణమైంది. మరో 6 నెలల్లో తెలంగాణ రాష్ర్టానికి కొత్త సీఎం వస్తారు! అని ప్రకటించారు. కొత్త సీఎం మరెవరో కాదు..సీఎం కుమారుడు కేటీఆరే అని క్లారిటీ ఇచ్చారు. జనవరిలో రాష్ట్రంలో సీఎం కుర్చీ చేతులు మారుతుందని […]
Advertisement
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితిని, సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిసేపు కలకలానికి కారణమైంది. మరో 6 నెలల్లో తెలంగాణ రాష్ర్టానికి కొత్త సీఎం వస్తారు! అని ప్రకటించారు. కొత్త సీఎం మరెవరో కాదు..సీఎం కుమారుడు కేటీఆరే అని క్లారిటీ ఇచ్చారు. జనవరిలో రాష్ట్రంలో సీఎం కుర్చీ చేతులు మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాలే సీఎం మార్పునకు కారణమవుతాయని ఆరోపించారు.
ఈ ప్రకటనపై ఆయన ఓ వివరణ కూడా ఇచ్చుకున్నారు. సీఎం మార్పు విషయం తనకు గులాబీ నేతల ద్వారానే తెలిసిందన్నారు. పార్టీలో రోజురోజుకు ముదురుతున్న అంతర్గత కలహాలే ఇందుకు కారణమని వివరించారు. మరో అడుగు ముందుకేసి 2018లోనే ముందస్తు ఎన్నికలకు వెళతారని కూడా ఊహించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే.. టీఆర్ ఎస్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని, ఆ పార్టీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు.
పాల్వాయి వ్యాఖ్యలను గులాబీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న విషయం లోకమంతా తెలుసన్నారు. పొరుగింటి వారిపై రాళ్లు వేయడం మాని, ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలని సూచిస్తున్నారు. సొంతపార్టీలోనే విలువ లేని నాయకుల మాటలను ప్రజలు నమ్మరన్న సంగతి ఇంకా ఎప్పుడు గుర్తిస్తారని చురకలంటిస్తున్నారు. జాతకాలు చెప్పడం మాని.. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలుకుతున్నారు.
Advertisement