స్విస్‌ చాలెంజ్‌లో సినీ దర్శకుడు ఆయనేనా?

స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని భూములను సింగపూర్‌ కంపెనీలకు కట్టబెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ భూములపై కన్నేసింది. విలువైన ఆర్టీసీ భూములను స్విస్ చాలెంజ్‌ పద్దతిలోనే కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. విడతల వారీగా ఈ భూములను ప్రభుత్వ పెద్దలు తమ అనుచరులకు అప్పగించనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొత్తం 1994 ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. తాజాగా తెనాలి పాత బస్‌ డిపోలో ఉన్న 1. 5 ఎకరాలు, విద్యాధరపురంలోని 6.10ఎకరాలను స్విస్ చాలెంజ్‌లో కట్టబెట్టేందుకు […]

Advertisement
Update:2016-07-05 02:22 IST

స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని భూములను సింగపూర్‌ కంపెనీలకు కట్టబెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ భూములపై కన్నేసింది. విలువైన ఆర్టీసీ భూములను స్విస్ చాలెంజ్‌ పద్దతిలోనే కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. విడతల వారీగా ఈ భూములను ప్రభుత్వ పెద్దలు తమ అనుచరులకు అప్పగించనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొత్తం 1994 ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. తాజాగా తెనాలి పాత బస్‌ డిపోలో ఉన్న 1. 5 ఎకరాలు, విద్యాధరపురంలోని 6.10ఎకరాలను స్విస్ చాలెంజ్‌లో కట్టబెట్టేందుకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.

ఆర్టీసీకి చెందిన ఈ భూములను టీడీపీకి అత్యంత సన్నిహితుడైన ఒక సినీ దర్శకుడికి కట్టబెట్టనున్నారని ఒక ప్రముఖ పత్రిక కథనాన్ని ప్రచురించింది. టీడీపీకి సన్నిహితుడైన సినీ దర్శకుడిగా ప్రస్తుతం రాఘవేంద్రరావుకు పేరుంది. ఆయన ఇప్పటికే హైదరాబాద్‌లో పలు కాంప్లెక్స్‌లను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి సదరు పత్రిక చెబుతున్న టీడీపీ సన్నిహిత దర్శకుడు రాఘవేంద్రరావే అయిఉండవచ్చునేమో!. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాఘవేంద్రరావు టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా నియమితులయ్యారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News