హెరిటేజ్‌ కోసం... నాడు చిత్తూరు డెయిరీ, నేడు ఏపీ డెయిరీ...

తీవ్ర వర్షాభావంతో అల్లాడే అనంతపురం జిల్లాలో రైతులు ఇంకా బతకగలుగుతున్నారంటే అందుకు పాడిపరిశ్రమ కూడా ప్రధాన కారణమే. అయితే ఇప్పుడు పాడికి పాడే కట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో అనంతపురం జిల్లాలో వేలాదిగా రైతులు రోడ్డెక్కారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నసమయంలో సొంత సంస్థ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసేయించిన చంద్రబాబు ఇప్పుడు… ఏపీ డెయిరీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత రెండున్నర నెలలుగా ఏపీ డెయిరీ పాల బిల్లులు చెల్లించడం […]

Advertisement
Update:2016-06-23 03:28 IST

తీవ్ర వర్షాభావంతో అల్లాడే అనంతపురం జిల్లాలో రైతులు ఇంకా బతకగలుగుతున్నారంటే అందుకు పాడిపరిశ్రమ కూడా ప్రధాన కారణమే. అయితే ఇప్పుడు పాడికి పాడే కట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో అనంతపురం జిల్లాలో వేలాదిగా రైతులు రోడ్డెక్కారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నసమయంలో సొంత సంస్థ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసేయించిన చంద్రబాబు ఇప్పుడు… ఏపీ డెయిరీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

గత రెండున్నర నెలలుగా ఏపీ డెయిరీ పాల బిల్లులు చెల్లించడం లేదు. మొత్తం 70 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఒక్క అనంతపురంజిల్లాలోనే 11 కోట్లు చెల్లించాల్సి ఉంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజవకర్గంలో ఏడు కోట్ల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లులు చెల్లించేందుకు ఏమాత్రం ప్రయత్నాలు చేయడం లేదు. పైగా పాల సేకరణ ధరను కూడా భారీగా తగ్గించేశారు. లీటర్ పాల ధరను రైతుల నుంచి గతంలో 26రూపాయలకు కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు దాన్ని 16 రూపాయలకు తగ్గించారని పాడి రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హిందూపురంలో వేలాది మంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు.

70 కోట్ల మేర బకాయిలుంటే కేవలం కోటి రూపాయలు మంజూరు చేయించి మంత్రి పరిటాల సునీత గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని రైతులు మండిపడ్డారు. చంద్రబాబు తీరుతో పాడి వ్యవస్థే కుప్పకూలేలా ఉందని రైతులు వాపోతున్నారు. గతంలో చిత్తూరు డెయిరీని కూడా ఇలాగే నష్టాల బాట పట్టించి… అనంతరం హెరిటేజ్‌ డెయిరీ అభివృద్ధి కోసం చిత్తూరు డెయిరీకి మరణ శాసనం రాసింది కూడా చంద్రబాబేనని గుర్తు చేసుకుంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News